Movie News

తమన్ మనసు పెడితే…

రెండు వారాల ముందే ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రిలీజైంది. ఆ చిత్రానికి ముందు అనుకున్న సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్. కానీ అతడితో సింక్ కుదరక తన ఆస్థాన సంగీత దర్శకుడు తమన్‌ను తెచ్చి పెట్టుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కట్ చేస్తే సినిమా కోసం ఒక్కటంటే ఒక్క మంచి పాట ఇవ్వలేకపోయాడు తమన్. ‘నారాయణమ్మ’ పాట కాస్త పర్వాలేదంటే.. అదేమో ఏదో పాత పాటను కాపీ కొట్టి చేసింది. మిగతా సాంగ్స్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఇందులో బీజీఎం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 

హర్షవర్ధన్‌ను పెట్టుకుని ఉంటే కొంచెం డిఫరెంట్ మ్యూజిక్ అయినా ఇచ్చేవాడేమో, ఏరి కోరి ఈ తమన్‌ను ఎందుకు పెట్టుకున్నట్లు అని అందరూ త్రివిక్రమ్‌ను తిట్టిపోశారు. తమన్ మీద ఏ రేంజిలో విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య కాలంలో తమన్ ఈ స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న సినిమా ఇదే. ఇక అతడి పనైపోయిందని చాలామంది తీర్మానించేశారు ఆ సినిమా చూసి. కానీ రెండు వారాలు గడిచాయో లేదో కథ మారిపోయింది.

మొన్న రాత్రి పెయిడ్ ప్రిమియర్స్‌తో మొదలైన ‘ఇట్లు అర్జున’లో తమన్ పనితనం గురించి ఎంత కొనియాడినా తక్కువే. ఇటు పాటలు.. అటు బీజీఎం రెండింట్లోనూ మెరుపులు మెరిపించాడు తమన్. పాటల్లో మిగతావన్నీ ఒకెత్తయితే.. రణవిహార మరో ఎత్తు. ఒక పెద్ద హీరో సినిమాలో హై మూమెంట్లో వచ్చే తరహా పాట ఇది. సినిమాలో సందర్భం కూడా భలేగా కుదరడంతో ఆ పాట థియేటర్లలో ప్రేక్షకులకు మాంచి కిక్కిస్తోంది. మిగతా పాటలు, స్కోర్ కూడా మంచి ఊపునిచ్చేవే. ముఖ్యంగా చివరి అరగంటలో తమన్ వేరే లెవెల్ ఔట్ పుట్ ఇచ్చి సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు.

తమన్ మనసు పెట్టి చేస్తే ఔట్ పుట్ ఎలా ఉంటుందో.. మహానుభావుడు, అరవింద సమేత, అల వైకుంఠపురములో, ఓజీ లాంటి సినిమాలు రుజువు. ఇటు పాటలు, అటు బీజీఎం రెండింట్లోనూ బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చిన సినిమాలివి. కాకపోతే అతడికి టైం ఉండదు. ఎక్కువ చిత్రాలకు పని చేయడం వల్ల శ్రద్ధ తగ్గుతుంది.

అతడికి టైం ఇచ్చి, దర్శకులూ కొంచెం టైం పెట్టి పని చేయించుకుంటే ఔట్ పుట్ అదిరిపోతుందనడానికి ‘ఇట్లు అర్జున’ రుజువు. ఒకప్పుడు త్రివిక్రమ్ అతడితో అలాగే వర్క్ చేయించుకున్నాడు. కానీ ఈ మధ్య ఆయనా లైట్ తీసుకున్నట్లున్నాడు. అతడికి టైమూ ఇచ్చినట్లు లేదు. అందుకే ‘ఆదర్శ కుటుంబం’ మ్యూజిక్ అలా తయారైంది. ఆ సినిమా చూసి తిట్టిన వాళ్లందరికీ రెండు వారాలు తిరక్కముందే బలమైన సమాధానం చెప్పాడు తమన్.

This post was last modified on November 14, 2026 7:08 am

Share

Recent Posts

అమెరికా విమానాశ్రయాల్లో ఏం జరుగుతుంది?

అమెరికాలో శుక్రవారం విమాన ప్రయాణాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తూ…

41 minutes ago

అమ‌రావ‌తికి ఒబెరాయ్.. దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అనేక సంస్థ‌లు పెట్టుబ‌డులు పెడుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు సంస్థ‌లు వ‌చ్చేశాయి. ఆర్బీఐ వంటి బ్యాంకింగ్ సంస్థ‌లు…

3 hours ago

టాక్సిక్‌తో దిల్ రాజుకి లాభాలొచ్చాయా?

కేజీఎఫ్‌, కేజీఎఫ్-2 చిత్రాల‌తో పాన్ ఇండియా స్థాయిలో పెద్ద సూప‌ర్ స్టార్ల‌లో ఒక‌డిగా అవ‌త‌రించిన య‌శ్ నుంచి.. ఆ త‌ర్వాత…

7 hours ago

ఏఐ కంపెనీల్లో వారికి 5 కోట్లు

టెక్నాలజీ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఏఐ నిపుణులకు భారీ జీతాలు ఇస్తారని తెలుసు. కానీ ఇప్పుడు అమెరికాలోని కొన్ని ప్రముఖ…

8 hours ago

థియేటర్ల దగ్గర ప్రేక్షకుల సందడెలా ఉంది

కొత్త శుక్రవారం వచ్చింది. బోలెడు రిలీజులు తెచ్చింది. తమ సినిమాని జనం చూసేందుకు ఏమేం చేయాలో ప్రమోషన్ల పరంగా అన్ని…

8 hours ago

మ‌న తిల‌క్ వ‌ర్మ‌నా… లేక మ‌ళ్లీ రోహిత్ శ‌ర్మ‌నా?

అంత‌ర్జాతీయ క్రికెట్లో గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఛాంపియ‌న్స్ ట్రోఫీ వన్డే సిరీస్‌తో భార‌త లెజెండ‌రీ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీ…

8 hours ago