
శ్రీనివాస మంగాపురంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ రాషా తడాని. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తెగా సినీ ప్రేక్షకులకు పరిచయమైన రాషా.. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి తెగ ట్రై చేస్తోంది. ఈ క్రమంలో తన అందం, ఫ్యాషన్ సెన్స్‌తో నెటిజన్ల దృష్టిని తరచూ ఆకర్షిస్తూ ఉంటుంది.
తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు అభిమానులను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో రాషా సిల్వర్ కలర్ చీరలో మెరిసిపోతూ కనిపించింది. చీర మొత్తం.. తలుకు తలుకు మనే డిజైన్‌తో ఉండగా, దానికి సరిపోయే బ్లౌజ్.. ఈ హీరోయిన్ కి మరింత అందం తెచ్చిపెట్టింది.
లాంగ్ హెయిర్‌ను వదులుగా వదిలేసి, సింపుల్ జ్యువెలరీతో ఎంతో స్టైలిష్‌గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. కెమెరా ముందు విభిన్నమైన పోజులతో ఫోటోలకు ఫోజులిచ్చిన రాషా.. తన ఫ్యాషన్ సెన్స్‌తో మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
ఇక ఈ హీరోయిన్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. బాలీవుడ్ నటి రవీనా టాండన్, ప్రముఖ సినీ నిర్మాత అనిల్ థడానీ కుమార్తెగా ప్రపంచానికి పరిచయమైన ఈ భామ.. ప్రస్తుతం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి తెగ ప్రయత్నిస్తోంది. 2025లో అభిషేక్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన ఆజాద్ సినిమాతో రాషా నటిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమెకు ఐఐఎఫ్ఏ ఉత్తమ తొలి నటి అవార్డు కూడా లభించింది.
మరోపక్క శ్రీనివాసమంగాపురం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కానీ ఈ సినిమా ఆమెకు అనుకున్న స్థాయిలో విజయం అందించలేకపోయింది. మరి ఈ హీరోయిన్ త్వరలోనే టాలీవుడ్ లో మరో అవకాశం అందుకొని.. తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందో లేదో చూడాలి.

Gulte Telugu Telugu Political and Movie News Updates
