Movie News

స్టూడియో కూర్చుని సినిమా తీసేశారా?

దేశభక్తి సినిమాలు బాగా సేల్ అవుతున్నాయని ఏ ముహూర్తాన సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా చేద్దామనుకున్నాడో కానీ.. అది ఆయనకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారిపోయింది. రెండేళ్ల కిందట ఈ సినిమా నుంచి ఫస్ట్ టీజర్ లాంచ్ చేయడం ఆలస్యం.. ఈ సినిమా చుట్టూ విమర్శలు, వివాదాలు ముసురుకున్నాయి. చైనా వాళ్ల అభ్యంతరాల నేపథ్యంలో సినిమా పేరును ‘మాతృభూమి’గా మార్చడంతో పాటు కథనూ చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. 

అప్పటిదాకా షూట్ చేసింది చాలా వరకు పక్కన పెట్టి, కొత్తగా సీన్లు రాసుకోక తప్పలేదు. చైనా సైన్యంతో మన ఆర్మీ వీరోచితంగా పోరాడిన తీరు వైనం మీద నడవాల్సిన కథ కాస్తా.. అసలు యుద్ధం చేయడం తప్పు, ఇండియా-చైనా భాయీ భాయీ అనేలా ఈ స్టోరీని మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో మొత్తం కథ స్వరూపమే మారిపోయి మొత్తం ఇదొక కంగాళీగా వ్యవహరంలా తయారైందని నిన్నటి ట్రైలర్ చూస్తే క్లియర్‌గా అర్థమైపోయింది. 

సల్మాన్ ఖాన్‌కు డిజాస్టర్లు కొత్త కాదు కానీ.. ఒక సినిమా రిలీజ్‌కు ముందే ఘోరాతి ఘోరమైన ఫలితాన్ని అందుకోబోతోందని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేయడం మాత్రం ‘మాతృభూమి’ విషయంలోనే జరుగుతోంది. ట్రైలర్ లాంచ్‌కు జరుగుతున్న ట్రోలింగ్ చూస్తుంటే.. రేప్పొద్దున సినిమా థియేటర్లలో రిలీజయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయాలు కలుగుతున్నాయి. కథను మార్చి రీషూట్లు చేయడం అనివార్యమైన పరిస్థితుల్లో టీం ఏం చేసిందన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

రియల్ లొకేషన్లకు వెళ్లి షూట్ చేయకుండా.. స్టూడియోలో కూర్చుని ఏఐ సాయంతో సన్నివేశాలు లాగించేశారన్నది ‘మాతృభూమి’ టీం మీద వస్తున్న ఆరోపణ. ట్రైలర్‌ను గమనిస్తే.. సల్మాన్ ఖాన్ ఒక్కో సన్నివేశంలో ఒక్కో రకంగా కనిపించాడు. ముఖం మీద గాయంతో కనిపించే ఒక సన్నివేశానికి సంబంధించి వేర్వేరు షాట్స్‌లో వేర్వేరు లుక్స్‌లో కనిపించాడు. ముఖం మీద గాయం ఆకృతి కూడా షాట్‌కు ఒక రకంగా మారిపోయి కనిపించింది. 

చాలా సన్నివేశాల్లో సహజత్వం కనిపించకపోవడం.. వెనుక గ్రీన్ కలర్ కనిపించడంతో.. లొకేషన్లకు వెళ్లకుండా గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్స్, ఏఐ సాయంతో సింపుల్‌గా సీన్లు లాగించేశారని అర్థమైంది. ఇంత పెద్ద స్టార్ సినిమాకు మరీ ఈ స్థాయిలో ఏఐ వాడకం ఏంటని.. ప్రేక్షకులను మరీ ఇంత గ్రాంటెడ్‌గా తీసుకోవడం తప్పని విమర్శలు వస్తున్నాయి. ఐతే డిజాస్టర్ ఖాయమని ముందే ఫిక్స్ అయిన సినిమాకు ఇంతకుమించి ఏం చేస్తారనే నిట్టూర్పులు కూడా వినిపిస్తున్నాయి. ‘మాతృభూమి’ డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on November 13, 2026 2:27 pm

Share

Recent Posts

హ్యాట్రిక్ హీరో… వాట్ నెక్స్ట్?

పదేళ్లకు పైగా సరైన విజయం లేక ఇబ్బంది పడ్డ తమిళ స్టార్ హీరో సూర్య.. కేవలం ఆరు నెలల వ్యవధిలో…

14 minutes ago

2018 టాంపరింగ్ గొడవ… వార్నర్ ఒకవైపు, కమిన్స్ మరోవైపు!

ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన శాండ్‌పేపర్ వివాదం ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ మొదలైంది. 2018లో జరిగిన బాల్ ట్యాంపరింగ్ గురించి మాజీ…

2 hours ago

దేవాంశ్‌ సినిమాల్లోకి వెళతాడేమో అని భయంగా వుంది

తన తాత ముత్తాతల ప్రభావంతో దేవాంశ్‌ కూడా సినిమాల వైపు వెళతాడేమోనని భయంగా వుందని మంత్రి నారా లోకేష్ చెప్పిన…

2 hours ago

ఒక మగాడి బలహీనత వల్ల లక్షల కోట్ల సామ్రాజ్యం కుదేలు

ఏఐ రంగంలో ఎన్విడియా పేరు తెలియనివాళ్లు ఉండరు. ప్రపంచంలోని పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీలకు అవసరమైన చిప్స్ అందిస్తున్న ఈ…

3 hours ago

అందరూ చేయందించడం అర్జున అదృష్టం

నిన్న రాత్రి హైదరాబాద్ ఏఎంబీ మల్టీప్లెక్సులో వేసిన ఇట్లు అర్జున ప్రీమియర్ షోకు దాదాపు టాలీవుడ్ మొత్తం హాజరయ్యిందేమో అన్నంత…

3 hours ago

రామసీత రావణుల్లో ఎవరికి లాభం

రామాయణ పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉంది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ వెయ్యి కోట్ల మార్కు అందుకుంది.…

3 hours ago