తన ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు శర్వానంద్. ఈ ఊపులో అతను ‘భోగి’ లాంటి ఊర మాస్ మూవీని లైన్లో పెట్టాడు. రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని రూపొందించాడు. శర్వా కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించాడు సీనియర్ నిర్మాత కె.కె.రాధా మోహన్. ఆగస్టు 28నే ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ అప్పటికి సినిమా రెడీ చేయలేకపోయారు.
ఇంకో రెండున్నర నెలలు టైం తీసుకుని, నవంబరు 12న ‘భోగి’ని రిలీజ్ చేయడానికి ముహూర్తం పెట్టుకున్నారు. కొన్ని రోజుల ముందు వరకు ఈ సినిమా విడుదలకు రేసులోనే ఉంది. కానీ తర్వాత కథ మారిపోయింది. సినిమా సెన్సార్ రివైజ్డ్ కమిటీకి వెళ్లడంతో రిలీజ్ ఆగిపోయింది. నిన్ననే వాయిదా గురించి అధికారిక ప్రకటన ఇచ్చారు. కానీ కొత్త డేట్ మాత్రం చెప్పలేదు. మరి ఈ సినిమాకు నెక్స్ట్ రిలీజ్ ఆప్షన్ ఎక్కడ అన్నది ప్రశ్నార్థకంగా ఉంది.
ఈ నెలలో చివరి రెండు వారాల్లో కూడా ‘భోగి’ని రిలీజ్ చేయడం కష్టమే. నవంబరు 19న ‘ఈఎన్ఈ రిపీట్’, 20న ‘ఆకాశంలో ఒకతార’ లాంటి క్రేజీ సినిమాలు రిలీజవుతున్నాయి. తమిళ అనువాదం ‘ఓం’ కూడా రాబోతోంది. నెలాఖర్లో ‘మైసా, హైందవ సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. డిసెంబరు తొలి వారంలోనేమో ‘వృషకర్మ’తో పాటు కొన్ని చిత్రాలు.. 11న అరడజను సినిమాల దాకా రాబోతున్నాయి. క్రిస్మస్ వీకెండ్లో కూడా రష్ గట్టిగా ఉంది. అసలక్కడ స్కోపే లేదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘భోగి’ని రిలీజ్ చేయడానికి కాస్త అవకాశం
కనిపిస్తున్నది డిసెంబరు మూడో వారంలో మాత్రమే. ముందు, తర్వాతి వారాల్లో క్రేజీ సినిమాలు రిలీజవుతుండడంతో ఆ వీకెండ్‌ను కాస్త ఖాళీగా వదిలారు. ఆ వీకెండ్‌కే తాజాగా అల్లరి నరేష్ సినిమా ‘ఆల్కహాల్’ షెడ్యూల్ అయింది. వేరే వీకెండ్లలో క్రేజీ చిత్రాలతో పోటీ పడడమా.. లేక క్రేజ్ లేని వీకెండ్లో తక్కువ పోటీ మధ్య రావడమా అన్నది ‘భోగి’ చూసుకోవాల్సి ఉంది. సంక్రాంతికి శర్వా మరో సినిమా ‘జార్జి క్రిష్’ రానున్న నేపథ్యంలో ‘భోగి’ని మరీ లేట్ చేయడానికి కూడా అవకాశం లేదు. మరి సంపత్ నంది అండ్ టీం ఏ ఆప్షన్ తీసుకుంటుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
