Movie News

40 కోట్ల అరంగేట్రం… ఫలితమిస్తుందా?

టాలీవుడ్లో ఎన్నో ఘనమైన అరంగేట్రాలు జరిగాయి. ఐతే ఇప్పుడు ఒక వ్యాపార కుటుంబానికి చెందిన కుర్రాడి విషయంలో.. పెద్ద సినీ కుటుంబాల పిల్లలను మించిన డెబ్యూ చూస్తున్నాం. ఆ కుర్రాడి పేరు.. అనీష్. ‘ఇట్లు అర్జున’ అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడీ యువ నటుడు. పబ్లిసిటీతో కలిపి ఈ సినిమా మీద పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా? దాదాపు రూ.40 కోట్లు. ఇప్పటిదాకా ఒక అరంగ్రేట్ర కథానాయకుడి సినిమాకు పెట్టిన రెండో అత్యధిక ఖర్చు ఇది.

11 ఏళ్ల కిందట అక్కినేని అఖిల్ తొలి చిత్రం ‘అఖిల్’ మీద రూ.50 కోట్ల దాకా బడ్జెట్ పెట్టాడు దాని నిర్మాత నితిన్. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ తొలి చిత్రం ‘అల్లుడు శ్రీను’ మీద రూ.40 కోట్ల దాకా ఖర్చు పెట్టాడు బెల్లంకొండ సురేష్. గత ఏడాది తన కొడుకు కిరీటి అరంగేట్ర చిత్రం ‘జూనియర్’ సినిమా కోసం గాలి జనార్దన రెడ్డి కూడా దాదాపు అంతే ఖర్చు చేశారూ. ఇప్పుడు ‘ఇట్లు అర్జున’ కోసం కూడా అంత బడ్జెట్ పెట్టాడు అనీష్ తండ్రి, ఏఎంఆర్ గ్రూప్ అధినేత మహేష్ రెడ్డి.

‘ఇట్లు అర్జున’కు వెంకీ కుడుముల సహ నిర్మాత అయితే ప్రధాన నిర్మాత మహేషే. ఆయనకు సన్నిహితులైన అక్కినేని నాగార్జున, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా చాలామంది ఈ సినిమా ప్రమోషన్ కోసం సాయం పట్టారు. వెంకీ కుడుముల దాదాపు రెండేళ్లుగా డైరెక్షన్ కూడా పక్కన పెట్టి ఈ సినిమాకు అన్నీ తానై చూసుకున్నాడు. కొత్త దర్శకుడు మహేష్ కంబాల మనసుపెట్టి సినిమా తీశాడు.

ఈ సినిమా ప్రోమోలైతే ఇంట్రెస్టింగ్‌గానే అనిపించాయి. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పరిచయం లేని కుర్రాడి సినిమా అయినా.. బజ్ క్రియేట్ చేయగలిగింది ‘ఇట్లు అర్జున’. ఈ రోజు పెద్ద సంఖ్యలో పెయిడ్ ప్రిమియర్స్ వేస్తుంటే.. రెస్పాన్స్ బాగుంది. పలుమార్లు వాయిదాపడి రేపే పూర్తి స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుంది.. కొత్త హీరో పెర్ఫామెన్స్ విషయంలో జనం ఏమంటారు? ఇంత కాస్ల్టీ అరంగేట్రానికి ఎలాంటి ఫలితం దక్కుతుంది అన్నది ఆసక్తికరం. ఈ చిత్రంలో అనీష్ సరసన మలయాళ భామ అనస్వర రాజన్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.

This post was last modified on November 12, 2026 5:28 pm

Share

Recent Posts

పాదయాత్ర ఒకటే సరిపోదు జగన్

వైసీపీ నేత‌ల నోటి నుంచి వినిపిస్తున్న ఏకైక మాట పాద‌యాత్ర‌. వ‌చ్చే ఏడాదిలో జ‌గ‌న్ 2.0 పేరుతో పాద‌యాత్ర ప్రారంభించ‌నున్నార‌న్న‌ది…

6 minutes ago

ఇడుపు కాయితం వివాదాలపై క్లారిటీ

ఈ మధ్య చిన్న సినిమాలకు వివాదాలే ప్రచార అస్త్రాలుగా మారుతున్నాయి. ఇడుపు కాయితం అనే చిన్న సినిమా విషయంలో ఇలాగే…

27 minutes ago

కియా అంటే ఏపీ… ఏపీ అంటే కియా

ఏపీలో కియా రెండో ప్లాంట్ విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతోంది. నవంబర్…

56 minutes ago

చంద్ర‌బాబుకు మరో ట్యాగ్

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు గురించి.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జాతీయ మీడియా వాట‌ర్ మ్యాన్ అంటూ.. ప్ర‌శంస‌లు…

2 hours ago

ఇక నారా లోకేశ్ వంతు!

ఏపీలో ఇప్పటికే ఫలితాలు వెల్లడైన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి పార్టీలు విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. అయితే,…

3 hours ago

ఆల్కహాల్ తాగడానికి టైమ్ సరిపోతుందా

అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ఆల్కహాల్ చాలా నెలలుగా ల్యాబ్ లో మగ్గుతోంది. సితార లాంటి పెద్ద సంస్థ నిర్మాణంలో…

5 hours ago