టాలీవుడ్లో ఎన్నో ఘనమైన అరంగేట్రాలు జరిగాయి. ఐతే ఇప్పుడు ఒక వ్యాపార కుటుంబానికి చెందిన కుర్రాడి విషయంలో.. పెద్ద సినీ కుటుంబాల పిల్లలను మించిన డెబ్యూ చూస్తున్నాం. ఆ కుర్రాడి పేరు.. అనీష్. ‘ఇట్లు అర్జున’ అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడీ యువ నటుడు. పబ్లిసిటీతో కలిపి ఈ సినిమా మీద పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా? దాదాపు రూ.40 కోట్లు. ఇప్పటిదాకా ఒక అరంగ్రేట్ర కథానాయకుడి సినిమాకు పెట్టిన రెండో అత్యధిక ఖర్చు ఇది.
11 ఏళ్ల కిందట అక్కినేని అఖిల్ తొలి చిత్రం ‘అఖిల్’ మీద రూ.50 కోట్ల దాకా బడ్జెట్ పెట్టాడు దాని నిర్మాత నితిన్. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ తొలి చిత్రం ‘అల్లుడు శ్రీను’ మీద రూ.40 కోట్ల దాకా ఖర్చు పెట్టాడు బెల్లంకొండ సురేష్. గత ఏడాది తన కొడుకు కిరీటి అరంగేట్ర చిత్రం ‘జూనియర్’ సినిమా కోసం గాలి జనార్దన రెడ్డి కూడా దాదాపు అంతే ఖర్చు చేశారూ. ఇప్పుడు ‘ఇట్లు అర్జున’ కోసం కూడా అంత బడ్జెట్ పెట్టాడు అనీష్ తండ్రి, ఏఎంఆర్ గ్రూప్ అధినేత మహేష్ రెడ్డి.
‘ఇట్లు అర్జున’కు వెంకీ కుడుముల సహ నిర్మాత అయితే ప్రధాన నిర్మాత మహేషే. ఆయనకు సన్నిహితులైన అక్కినేని నాగార్జున, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా చాలామంది ఈ సినిమా ప్రమోషన్ కోసం సాయం పట్టారు. వెంకీ కుడుముల దాదాపు రెండేళ్లుగా డైరెక్షన్ కూడా పక్కన పెట్టి ఈ సినిమాకు అన్నీ తానై చూసుకున్నాడు. కొత్త దర్శకుడు మహేష్ కంబాల మనసుపెట్టి సినిమా తీశాడు.
ఈ సినిమా ప్రోమోలైతే ఇంట్రెస్టింగ్గానే అనిపించాయి. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పరిచయం లేని కుర్రాడి సినిమా అయినా.. బజ్ క్రియేట్ చేయగలిగింది ‘ఇట్లు అర్జున’. ఈ రోజు పెద్ద సంఖ్యలో పెయిడ్ ప్రిమియర్స్ వేస్తుంటే.. రెస్పాన్స్ బాగుంది. పలుమార్లు వాయిదాపడి రేపే పూర్తి స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుంది.. కొత్త హీరో పెర్ఫామెన్స్ విషయంలో జనం ఏమంటారు? ఇంత కాస్ల్టీ అరంగేట్రానికి ఎలాంటి ఫలితం దక్కుతుంది అన్నది ఆసక్తికరం. ఈ చిత్రంలో అనీష్ సరసన మలయాళ భామ అనస్వర రాజన్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates
