రేపు డీఎన్కే విడుదల కానుంది. మైత్రి నిర్మాణం కావడంతో రిలీజ్ పరంగా మంచి స్క్రీన్ కౌంట్ దక్కనుంది. రామాయణ పార్ట్ 1, సీన్ రెండో వారంలో కూడా బలంగా నిలుస్తున్న నేపథ్యంలో కొత్త రిలీజుల మధ్య డీఎన్కే ఎదుర్కొబోయే పోటీ చాలా పెద్దదే ఉంది. పైగా పండుగలన్నీ అయిపోయాక వచ్చే నవంబర్ నెలలో జనాన్ని థియేటర్లకు రప్పించాలంటే అంత ఆషామాషీగా ఉండదు. యునానిమస్ టాక్ వస్తేనే జనం టికెట్లు కొనేందుకు రెడీ అవుతారు. చిన్న సినిమాలకు ఇది పెద్ద సవాలే.
అయితే డీఎన్కే విషయంలో మౌళి చాలా యాక్టివ్ ప్రమోషన్లు చేశాడు. ఇంటర్వ్యూలలో పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇచ్చాడు. ట్రోలింగ్ కి సమాధానాలు ఇస్తూనే తన కాన్ఫిడెన్స్ బయట పెట్టుకున్నాడు. ఈవెంట్లలో తన మీద అటెన్షన్ వచ్చేలా ఏమేం చేయాలో ఏమేం మాట్లాడాలో అంతా చేశాడు. ముఖ్యంగా స్పీచులు, చేతలు ద్వారా వైరలయ్యే అవకాశాలు ఎన్ని ఉంటే అన్నీ వాడుకున్నాడు. వాటికి సమాధానం రేపు ఓపెనింగ్స్ రూపంలో దొరకనుంది. పాజిటివ్ వస్తే సంతోషమే.
ఇంత ప్రత్యేకంగా దీని గురించి చెప్పుకోవడానికి కారణం ఉంది. లిటిల్ హార్ట్స్ వచ్చి ఏడాది అయిపోయింది. మౌళి లాంటి అప్ కమింగ్ హీరో కూడా తన రెండో సినిమాకు ఇంత టైం తీసుకోవడం చూస్తే టాలీవుడ్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదేదో నెగటివ్ గా అంటున్న మాట కాదు. వందల కోట్ల మార్కెట్ ఉన్న స్టార్లు నెలలు సంవత్సరాల తరబడీ గ్యాప్ తీసుకుంటే పర్వాలేదు కానీ మౌళి కూడా ఇంత సమయం తీసుకోవడం సమర్ధనీయం కాదు.
డీఎన్కే కనక హిట్ అయితే మౌళి మార్కెట్, రెమ్యునరేషన్ రెండూ పెరుగుతాయి. ఇతర నిర్మాతలు వెంటపడతారు. లిటిల్ హార్ట్స్ టైంలోనే అది జరిగింది. ఇప్పుడు దాన్ని మరింత ఇంప్రూవ్ చేసుకునే దిశగా మౌళి ఆశలన్నీ డీఎన్కే మీద ఉన్నాయి. దొంగ నా కొడుకు టైటిల్ కి అబ్జెక్షన్ రావడం దర్శకుడు ఇలా షార్ట్ ఫార్మ్ పెట్టుకున్నాడు. క్రైమ్ ప్లస్ కామెడీ రెండూ మిక్స్ చేసిన ఈ సినిమా ద్వారా శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సింజిత్ ఎర్రమిల్లి సంగీతం సమకూర్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
