అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి.. గ్రీస్‌లో గ్రాండ్ వెడ్డింగ్!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది.

పెళ్లి తర్వాత అనిరుధ్ తన సోషల్ మీడియా ఖాతాలో కావ్యతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేయగా.. అది ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫొటోతో వీరి పెళ్లి వార్త మరింతగా వైరల్ అవుతోంది.

మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సూపర్ స్టార్ రజినీకాంత్ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వివాహ వార్తతో అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఈ జంట నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.

మొత్తానికి అనిరుధ్, కావ్యల వివాహం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చెన్నైలో జరగనున్న రిసెప్షన్‌పై కూడా ఆసక్తి నెలకొంది. అందుకు సీఎం విజయ్ హాజరు కావడం కూడా ఒక కారణం.