త్రివిక్రమ్ శ్రీనివాస్ చుట్టూ కొత్త ప్రచారాలు

ఇటీవలే విడుదలైన ఆదర్శ కుటుంబం ఏకె 47తో రికార్డులు బద్దలు కొడతారనుకుంటే దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీవ్రంగా నిరాశ పరచడం వెంకటేష్ అభిమానులకు హర్ట్ చేసింది. టాక్ తొలుత డీసెంట్ గా వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిలబడేందుకు అది సరిపోకపోవడంతో త్వరగానే ఫైనల్ రన్ కు వెళ్తోంది. దానికి తోడు రామాయణ పార్ట్ 1, సీన్ రెండూ పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడం వెంకీ మూవీని మరింత దెబ్బ తీసింది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ మీద కొత్త ప్రచారాలు ఊపందుకున్నాయి.

వాటిలో మొదటిది త్రివిక్రమ్ తమ హారికా హాసిని భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసి రాధాకృష్ణ, నాగవంశీతో విడిపోవడమట. ఇది ఈనాటి బంధం కాదు. పైగా ఇదే కలయికలో జూనియర్ ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా ఫాంటసీ మూవీ ఆల్రెడీ అధికారికంగా ప్రకటించారు. మరి ఇంత హఠాత్తుగా బ్రేకప్ చెప్పుకుంటారానేది అనుమానంగానే ఉంది. ఫిలిం నగర్ టాక్స్ అయితే జోరుగా ఉన్నాయి. ఒకవేళ నిజమే అయ్యే పక్షంలో తారక్ గాడ్ అఫ్ వార్ పరిస్థితి ఏంటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఇప్పటికైతే భేతాళ ప్రశ్నే.

ఇక రెండో ప్రచారం త్రివిక్రమ్ త్వరలో డివివి ఎంటర్ టైన్మెంట్స్ తో చేతులు కలుపుతారట. చిరంజీవి హీరోగా ఒక సబ్జెక్టు సిద్ధం చేసి తక్కువ రోజుల్లో తెరకెక్కించేలా ప్లానింగ్ జరుగుతోందని చెప్పుకుంటున్నారు. ఫాస్ట్ గా కాకాని బాబీ కొల్లి ఎలా అయితే తీస్తున్నారో దీనికి అదే ఫార్ములా వాడతారట. జై చిరంజీవకు డైలాగులు రాసిన తర్వాత త్రివిక్రమ్ మళ్ళీ మెగాస్టార్ మూవీకి పని చేయలేదు. ఇప్పుడీ కాంబో నిజమైతే మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అవుతుంది. జరుగుతుందా అనేదే అసలు క్వశ్చన్.

ప్రస్తుతం త్రివిక్రమ్ అందుబాటులో లేరు. ఆదర్శ కుటుంబం రిలీజ్ కు ముందు ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శనం ఇవ్వడం తప్పించి సినిమా థియేటర్లకు వచ్చాక కనిపించలేదు. నాగవంశీ కూడా ఎలాంటి సౌండ్ చేయలేదు. 75 కోట్ల ఫస్ట్ వీకెండ్ పోస్టర్ వదిలాక హఠాత్తుగా ప్రమోషన్లు మ్యూట్ చేశారు. అన్నీ ఒకదానికి ఒకటి లింక్ చేస్తుంటే గాసిప్పులో ఏదో మ్యాటర్ ఉన్నట్టే కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయడం తప్ప ఆప్షన్ లేదు.