కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్ తనయురాలు కావ్య మారన్ మంగళవారం పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరి డెస్టినేషన్ వెడ్డింగ్‌కు గ్రీస్ వేదిక కాబోతోంది. పెళ్లి వేడుక ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగబోతోంది. మారన్‌కు సోదరుడైన మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబం కూడా పెళ్లి కోసం గ్రీస్‌కు బయల్దేరి వెళ్లింది.
ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో స్టాలిన్ అవతారం చూసిన వాళ్లందరూ అవాక్కవుతున్నారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన దగ్గర్నుంచి స్టాలిన్ ఎప్పుడూ ఒకే అవతారంలో కనిపిస్తూ వచ్చారు. తెల్ల చొక్కా, తెల్ల పంచె.. ఎప్పుడూ ఆయనది ఇదే లుక్. బయట ఏదైనా వేడుకలకు వచ్చినా అదే గెటప్‌లో ఉంటారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా లుక్ ఎప్పుడూ మార్చింది లేదు.
కానీ అనిరుధ్ పెళ్లి కోసం గ్రీస్‌కు బయయల్దేరిన సందర్భంగా స్టాలిన్ కలర్ ఫుల్ సూటు బూటు వేసుకుని సరికొత్తగా తయారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి రాగా.. అది వైరల్ అయిపోయింది. మాజీ సీఎం లుక్ చాలా బాగుందని.. రాజకీయాల్లో ఉన్నా సరే అప్పుడప్పుడూ ఇలా లుక్ మార్చాల్సిందే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. స్టాలిన్ లుక్ మార్చడానికి సీఎం విజయ్ కూడా ఒక కారణమేమో అన్న చర్చ కూడా జరుగుతోంది.
యువతను ఆకర్షించే ఉద్దేశంతో, తాను మిగతా రాజకీయ నాయకుల టైపు కాదు అని చాటిచెప్పడానికి ఆయన సూటుతోనే అసెంబ్లీకి వస్తున్నారు. బయట కూడా ఆ అవతారంలోనే కనిపిస్తున్నారు. ఇప్పుడు స్టాలిన్ కూడా ఆ బాటలో నడవడం చూస్తుంటే.. విజయ్ ప్రభావం ఆయన మీద గట్టిగానే ఉన్నట్లుంది. ఇదిలా ఉంటే.. అనిరుధ్, కావ్యల వెడ్డింగ్ రిసెప్షన్ ఈ నెల 21న చెన్నైలో ఘనంగా జరగబోతోంది. దేశ వ్యాప్తంగా అనేకమంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేయబోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates