రాజమౌళి రాముడి మీద డౌట్ అక్కర్లేదు

ఇప్పుడు ఎక్కడ చూసినా రామాయణ పార్ట్ 1 కు వచ్చిన స్పందన, రికార్డు కలెక్షన్ల గురించిన చర్చే జరుగుతోంది. హిందీలోనే కాదు ఏపీ తెలంగాణ కర్ణాటక లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వసూళ్లు భారీగా ఉండటం ట్రేడ్ వర్గాలను ఆనందంలో ముంచెత్తుతోంది. టికెట్ రేట్ల పెంపుకు వెళ్లకుండా డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు తీసుకున్న మంచి నిర్ణయం కారణంగా బిసి సెంటర్లలోనూ రామాయణం ఆక్యుపెన్సీలు బాగున్నాయి. ఆదివారం చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించడం అబద్దం కాదు.

ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే రాముడిగా రన్బీర్ కపూర్ విజయవంతంగా పరీక్ష పాసయ్యాడు. యానిమల్ లో మనుషుల ప్రాణాలను మంచి నీళ్లు తాగినంత ఈజీగా తీసేసే పాత్రలో చూశాక జానకీరాముడి పాత్రలో జనం చూడగలరా అనే అనుమానం ఇండస్ట్రీ వర్గాల్లో కలిగింది. దాన్ని పటాపంచలు చేస్తూ యష్ లాంటి పెర్ఫార్మన్స్ పవర్ హౌస్ ని ఎదురుగా పెట్టుకుని కూడా తన ఉనికిని బ్రహ్మాండంగా చాటుకున్నాడు రన్బీర్ కపూర్. రెండో భాగానికి కావాల్సిన కాన్ఫిడెన్స్ పోగు చేసుకున్నాడు.

ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రాముడు మన రాజమౌళి మహేష్ బాబే. వారణాసిలోని ఒక ముఖ్యమైనే ఎపిసోడ్ లో సూపర్ స్టార్ ని సీతాపతిగా చూడబోతున్న సంగతి తెలిసిందే. ఇది చాలా కీలకమైన ఘట్టంగా ఇప్పటికే టాక్ ఉంది. రాముడి క్యారెక్టర్ లో మహేష్ ని చూస్తే గూస్ బంప్స్ ఖాయమని, అంత గొప్పగా డిజైన్ చేసిన ఘనత జక్కన్నకు దక్కుతుందని ఇప్పటికే టాక్ ఉంది. సినిమా మొత్తం రాముడు లేకపోయినా ఆ ఇంపాక్ట్ థియేటర్ నుంచి బయటికి వచ్చాక కూడా వెంటాడుతుందట.

ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ ని అల్లూరి సీతారామరాజుగా చూపిస్తే నార్త్ ఆడియన్స్ తనలో రాముడిని చూసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అలాంటిది తన హీరోని నేరుగా రాముడిగా రాజమౌళి చూపిస్తే వాళ్ళు ఏమవుతారో చెప్పనవసరం లేదు. సో ఎలాంటి అనుమానం లేకుండా రామాయణని రాజమౌళి తన మాయాజాలంతో ఓవర్ టేక్ చేస్తాడని చెప్పడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఏప్రిల్ 7 విడుదల కాబోతున్న ఈ విజువల్ గ్రాండియర్ ప్రమోషన్లు అతి త్వరలో మొదలుపెడతారట.