కాకా గురించి నెలకు కనీసం రెండు మూడుసార్లు పుకార్లు రావడం, వాటిని ఖండిస్తూ ఏదో ఒక రూపంలో జనవరి 13 విడుదల ఖరారు చేయడం పరిపాటిగా మారింది. నిన్న రచయిత కోన వెంకట్ పోస్ట్ చేసిన ఫోటో మరోసారి ఈ చర్చకు దారి వేసింది. విశ్వంభర అయోమయం ఇంకా తేలలేదు. దీని కోసమే కాకా ప్రమోషన్లు చేయకుండా సైలెంట్ గా ఉన్నారని మెగా ఫ్యాన్స్ లో గుసగుస ఉంది. కానీ యువి బృందం నుంచి ఎలాంటి రియాక్షన్, అప్డేట్ లేదు. ఇదే పెద్ద సమస్యగా మారిపోయింది.
సంక్రాంతికి వచ్చి తీరాలని కాకా కంకణం కట్టుకోవడం బాగానే ఉంది కానీ ఈ సినిమాని సరైన ప్రణాళికతో జనంలోకి తీసుకెళ్లడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవతల రేసులో ఉన్న అనిల్ రావిపూడి ప్రతి షెడ్యూల్ కి వీడియో అప్డేట్ ఇస్తున్నాడు. ఎక్కడ వెళ్ళింది, ఏ లొకేషన్ లో తీసింది, ఏ సందర్భంలో వస్తుంది లాంటి వివరాలను సింపుల్ గా అర్థమయ్యేలా చెబుతున్నాడు. త్వరలోనే మొదటి ఆడియో సింగల్ రిలీజ్ కు రంగం సిద్ధమయ్యింది. బహుశా రేపో ఎల్లుండో అనౌన్స్ మెంట్ రావొచ్చు.
అలాంటప్పుడు కాకా కూడా ఇదే దూకుడు చూపించాలి. తమన్ చెప్పిన దాని ప్రకారం ఈ మెగా మూవీలోని మొదటి పాట డిసెంబర్ లో అమెరికా వెళ్లి మరీ లాంచ్ చేయబోతున్నారు. దానికి చిరు హాజరు కూడా ఉంటుంది. అంటే పబ్లిసిటీని కేవలం నెల ముందు మాత్రమే మొదలు పెడతారన్న మాట. ఇది సరిపోదనేది ఫ్యాన్స్ అభిప్రాయం. యూనిట్ టాక్ ప్రకారం కాకాలో నాలుగు పాటలే ఉంటాయి. ఒకటి మాత్రం మెగాస్టార్ వింటేజ్ డాన్స్ చూపించేలా డిజైన్ చేశారని టాక్.
సరే ఇదంతా ఎలా ఉన్నా కాకా అంత పంతంగా ఉంది కాబట్టి ముందైతే ప్రచారానికి తెర తీయాలి. నెట్ ఫ్లిక్స్ మెగావర్స్ టాక్ షోని చేసుకుంటూనే కాకా షూటింగ్ బ్యాలన్స్ చేసుకుంటున్న చిరంజీవి డిసెంబర్ మూడో వారం నుంచి అందుబాటులోకి వచ్చి కాకా ప్రమోషన్స్ లో భాగమవుతారని తెలిసింది. వరస ప్యాన్ ఇండియా డిజాస్టర్లతో కుదేలైన కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థకు ఒక పెద్ద హిట్ ఇచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత కాకా రూపంలో దర్శకుడు బాబీ కొల్లి మీద ఉంది. చూడాలి ఏం చేస్తారో.
Gulte Telugu Telugu Political and Movie News Updates