సురేఖ వాణి వీడియో నిజమే కానీ…

సీనియర్ నటి సురేఖ వాణి పేరు నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆమె ప్రైవేట్ వీడియో ఒకటి వైరల్ కావడమే అందుకు నిదర్శనం. ఈ వీడియోలో సురేఖ.. ఒక కుర్రాడితో చాలా సన్నిహితంగా ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో సురేఖ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచే పోస్ట్ కావడం గమనార్హం. ఐతే కాసేపటికి ఆ వీడియో డెలీట్ అయింది.

దీంతో ఆ వ్యక్తి ఎవరు.. అతడితో ఇంత సన్నిహితంగా ఫొటోలు దిగి, సురేఖనే స్వయంగా వీడియో పోస్ట్ చేయడమేంటి.. మళ్లీ డెలీట్ ఎందుకు చేసింది అని అందరూ చర్చించుకుంటున్నారు. అసలు ఈ వీడియో ఒరిజినిలా.. లేక మార్ఫ్ చేశారా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఐతే దీని గురించి సురేఖ ఇన్‌స్టాలో ఒక పోస్టు ద్వారా క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తనదే అని సురేఖ వాణి స్పష్టం చేసింది.

ఐతే తన ఇన్‌స్టా అకౌంట్ ఎవరో హ్యాక్ చేసి.. ఆ వీడియోను లీక్ చేసినట్లు సురేఖ వెల్లడించింది. తన అనుమతి లేకుండా ఇలా ప్రైవేట్ వీడియోను ఆన్ లైన్లో లీక్ చేయడం అనైతికమని సురేఖ ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పిన సురేఖ.. ఎవరైనా ఈ వీడియోను పోస్ట్ చేసినా, షేర్ చేసినా చట్టపరంగా చర్యలు తప్పవని ఆమె హెచ్చరించింది.

‘‘మీమ్ పేజీలు, మీడియా ఫ్లాట్ ఫామ్స్, యూట్యూబ్ ఛానెళ్లు.. ఇలా అందరికీ చెబుతున్నా. ఆ వీడియోను షేర్ చేయడం ఆపండి. ఆ వీడియోను అప్‌లోడ్ చేయడం, రీపోస్ట్ చేయడం లాంటివి చేయొద్దు. నా ప్రైవేటు వీడియోను ఎవ్వరు పోస్ట్ చేసినా, షేర్ చేసినా.. వారి మీద లీగల్ యాక్షన్ తప్పదు. మీ వ్యూస్, రీచ్, పబ్లిసిటీ కోసం ఈ పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకోవద్దు. నా వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించండి. ఇది చాలా తీవ్రమైన విషయం. చట్టపరమైన చర్యలకు వెనుకాడను’’ అని సురేఖావాణి పేర్కొంది.