సినిమా వేడుకలకు సంబంధించిన వేడుకల మీద, ఇంటర్వ్యూల్లో సెలబ్రెటీలు మాట్లాడేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటల ఫ్లోలో.. అత్యుత్సాహంతో ఏదైనా అభ్యంతరకర కామెంట్ చేస్తే జరిగే డ్యామేజ్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా పెద్ద ఫ్యాన్ డమ్స్ హర్టయ్యేలా కామెంట్లు చేస్తే అంతే సంగతులు. ఇప్పుడు ప్రముఖ అనువాద రచయిత, లిరిసిస్ట్ రాకేందుమౌళి ఒక పాడ్ కాస్ట్‌లో ఇలాంటి కామెంటే చేసి ఇబ్బందుల్లో పడ్డాడు.
ఇతర భాషల నుంచి వచ్చే డబ్బింగ్ సినిమాలకు సంబంధించి అనువాద బాధ్యతలు ఎక్కువగా తనే తీసుకోవడం ఎదురైన ప్రశ్నకు సరదాగా సమాధానం చెప్పే క్రమంలో ‘‘నేను తొక్కేయడమేంటి.. నేనేమైనా బాస్‌నా తొక్కేయడానికి’’ అని కామెంట్ చేశాడతను. ఇది మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. బాస్ తొక్కేయడం అనే కామెంట్ వెనుక ఒక స్టోరీ ఉంది.
మెగాస్టార్ చిరంజీవి మీద యాంటీ ఫ్యాన్స్ ఈ మధ్య ఒక నెగెటివ్ క్యాంపైన్ నడుపతున్నారు. ఆయన యంగ్ టాలెంట్‌ను తొక్కేస్తాడని, ఆయన వల్ల ఉదయ్ కిరణ్ సహా చాలామంది యువ కథానాయకులు నష్టపోయారని వాళ్లు ఆరోపిస్తుంటారు. దీని మీద అనేక మీమ్స్ కూడా తయారు చేసి చిరును ట్రోల్ చేస్తుంటారు. ఐతే దీని మీద మెగా ఫ్యాన్స్ చాలా గట్టిగానే రిటార్ట్ ఇస్తుంటారు.
కష్టపడి ఇండస్ట్రీలో ఎదిగిన చిరు.. యంగ్ టాలెంట్‌ను తొక్కేయడం ఏంటి అని మండిపడుతుంటారు. ఐతే యాంటీ ఫ్యాన్స్ చేసే ట్రోలింగ్‌ను నార్మలైజ్ చేస్తూ.. రాకేందు మౌళి కామెంట్ చేయడం మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకుపోయే రాకేందుకు ఇలాంటి కామెంట్ చేయాల్సిన అవసరమేంటి.. సరదాలు హద్దులు దాటితే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఇక నుంచి అయినా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని వార్నింగ్ ఇస్తున్నారు.
This post was last modified on November 7, 2026 11:38 am
చెన్నైలో అంగరంగ వైభోగంగా జరిగిన వై ఎస్ అనిల్ కుమార్ రెడ్డి కూతురి వివాహం మరిచిపోక ముందే బీహార్లో ఓ…
ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన నటి కాజల్ అగర్వాల్. వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే.. సినిమాలకు…
అదేం చిత్రమో కానీ... రెండూ తెలుగు రాష్ట్రాల్లో ఒకే విధమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో…
సూర్య కొత్త సినిమా 'సీన్' వసూళ్లు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. రివ్యూలు మరీ గొప్పగా రాలేదు. పబ్లిక్ టాక్ సోషల్ మీడియాలో…
పోలవరం జిల్లాలో తాజాగా జరిగిన పరిషత్ ఎన్నికలలో జనసేన పూర్తిగా ఇరుకున పడింది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు ప్రజలు జేజేలు…
తెలుగునాట అతి పెద్ద పండగల్లో దీపావళి ఒకటి. సెలవులు ఎక్కువ ఉండకపోయినా సెలబ్రేషన్స్ పీక్స్ లో ఉంటాయి. ముఖ్యంగా టపాసుల…