కోహినూర్ వజ్రంలా మెరిసిపోయిన శ్రీలీల..!

శ్రీలీల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమా పెళ్లిసందడితోనే తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన ధమాకా చిత్రంతో.. నిజంగానే ధమాకా సృష్టించింది. ధమాకా సినిమా ఎప్పుడు వచ్చిందో కానీ, అప్పటి నుంచి ఈ హీరోయిన్‌ ఇప్పటివరకు అవకాశాలు లేని రోజే చూడలేదు అని చెప్పవచ్చు.

ధమాకా తర్వాత ఎన్నో వరుస ఫ్లాపులు వచ్చినా శ్రీలీలకు మాత్రం అభిమానులు తగ్గలేదు, అవకాశాలు కూడా తగ్గలేదు. తాను నటించిన సినిమాల్లో బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రంలో మంచి పాత్రను సొంతం చేసుకుని తన నటనతో కూడా ఆకట్టుకుంది. ఈ హీరోయిన్‌కు ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ.. ఇక ఈమె పని అయిపోయిందని చాలామంది అనుకుంటే..ఆ వెంటనే మూడు నాలుగు సినిమాలకు సైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తూ వచ్చింది.

తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూనే ఒకపక్క హిందీలో, మరోపక్క తమిళంలో కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫోటోలు షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా వైట్ డ్రెస్‌లో వజ్రంలా మెరిసిపోతూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ డ్రెస్‌లో శ్రీలీలను చూస్తే ఎవరైనా సరే అతిలోకసుందరి అనకుండా ఉండలేరు. డైమండ్ చెవి కమ్మలు, మెరిసిపోయే డ్రెస్, మైమరిపించే నవ్వుతో కుర్రకారు మనసులను ప్రేమలో పడేస్తోంది.

నిన్న రాత్రి జరిగిన ఫంక్షన్ లో ఫోటోలు అంటూ క్యాప్షన్ పెట్టి.. అందరినీ ఫిదా చేసే ఫోజులతో.. ఇంస్టాగ్రామ్ లో సెగలు పుట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ.