ఇట్లు అర్జున.. ఈ మధ్య టాలీవుడ్ చర్చనీయాంశం అవుతున్న చిన్న సినిమా. ఇందులో అనీష్ అనే కొత్త హీరో లీడ్ రోల్ చేశాడు. మలయాళ భామ అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం విశేషం. మహేష్ ఉప్పాల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్, పాటలు.. ఇటీవలే లాంచ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ ఆకట్టుకున్నాయి.
ఐతే ఒక కొత్త హీరో నటించిన సినిమాకు తమన్ సహా పేరున్న టెక్నీషియన్లు పని చేయడం.. మిడ్ రేంజ్ హీరోల సినిమాల స్థాయిలో క్వాలిటీ కనిపించడం.. వెంకీ తన సినిమాలు పక్కన పెట్టి ఈ సినిమాలో ఇన్వాల్వ్ కావడం ఒకింత ఆశ్చర్యపరిచేదే. దీనికి చేస్తున్న పబ్లిసిటీ కూడా ఒక లెవెల్లో ఉంటోంది. అక్కినేని నాగార్జున ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా.. జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రమోషన్లలో భాగమయ్యాడు.
మరి ఒక కొత్త హీరో సినిమాకు ఇంత బ్యాకప్ ఏంటి అనే సందేహం కలగక మానదు. దీనికి కారణం ఈ కుర్రాడి బ్యాగ్రౌండ్. రియల్ ఎస్టేట్-కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఎంతో పేరుమోసిన ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత మహేష్ రెడ్డి కొడుకే ఈ అనీష్. ఆయనకు నాగ్, తారక్ మాత్రమే కాదు.. సినీ రంగంలో చాలామంది ప్రముఖులతో చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది.
మహేష్ రెడ్డి గతంలో నిర్మాతగా రెండు సినిమాలు కూడా తీశారు. అవే.. నాగ్ హీరోగా నటించిన షిర్డీ సాయిబాబా, ఓం నమో వేంకటేశాయ. ఈ చిత్రాలు ఆశించిన ఫలితాలు రాబట్టకపోవడంతో మళ్లీ ప్రొడక్షన్ చేయలేదు. ఐతే ఇప్పుడు తన చిన్న కొడుకుని హీరోగా అరంగేట్రం చేయిస్తున్నాడు. సెలబ్రెటీల హ్యాండ్ పడడానికి తోడు.. ప్రోమోలు కూడా బాగుండడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల్లో బాగానే బజ్ క్రియేట్ అయింది. ఈ నెల 13న ‘ఇట్లు అర్జున’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates