మండోదరి కాదు.. మన చందమామ ఎప్పటికీ అప్సరసే!

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన అందంతో మాయ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆ తర్వాత చందమామ సినిమాతో నిజంగానే చందమామ అనిపించుకుంది. ఇక మగధీర లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో తన హవా కొనసాగించింది.

కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని ఓ కొడుకుకు జన్మనిచ్చిన కాజల్.. ఆ తర్వాత మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. పెళ్లి, పిల్లలు, సినిమాలు.. ఇలా తన లైఫ్ లో ఎన్ని మార్కులు వచ్చినా.. తన అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ అదే అందంతో అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇక కాజల్ నటించిన పాన్ ఇండియా సినిమా రామాయణ పార్ట్ 1 ఈరోజు విడుదలైంది. ఈ చిత్రంలో ఆమె మండోదరి పాత్రలో కనిపించింది. అయితే కాజల్ అభిమానులు మాత్రం ఆమెను మండోదరిగా కాకుండా అప్సరసలా ఉందంటూ.. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలను షేర్ చేస్తూ అందంపై కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు కూడా అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న స్టైలిష్ దుస్తుల్లో.. కాజల్ నిజంగానే కడిగిన ముత్యంలా మెరిసిపోయింది. చిన్న చిన్న పూసలతో కూడిన టాప్‌లో.. బ్లాక్ మిడ్డిలో.. కాజల్ షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ లుక్ మరోసారి అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది.

ఆమె ధరించిన స్టైలిష్ వాచ్, వేళ్లకు పెట్టుకున్న ఉంగరాలు కూడా ఈ లుక్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఎప్పటిలాగే తన అందమైన కళ్లతో అభిమానులను ప్రేమలో పడేస్తూ.. తన స్టైల్‌తో అందరినీ మాయ చేసేసింది.

మొత్తం పైన మందోదరి పాత్రలో కనిపించినా.. మన కాజల్ మాత్రం ఎప్పటికీ అప్సరసే అని ఈ ఫోటోలు మరోసారి నిరూపిస్తున్నాయి.