హీరోలకైనా, హీరోయిన్లకైనా కెరీర్లో కొన్నేళ్లు గడవగానే కొన్ని డీఫాల్ట్ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. మీ పెళ్ళిఎప్పుడు.. మీకు కాబోయేవారికి ఎలాంటి లక్షణాలు ఉండాలని. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవికి కూడా ఇంతకుముందే ఈ ప్రశ్నలు ఎదురై ఉండొచ్చు. ఇప్పుడు ‘రామాయణం’తో పాన్ వరల్డ్ ప్రేక్షకులకు పరిచయం అవుతున్న సాయిపల్లవికి.. ఏకంగా అమితాబ్ బచ్చనే ఈ ప్రశ్నలు వేశారు.
తాను హోస్ట్ చేసే ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోకు వచ్చిన సాయిపల్లవితో బిగ్-బి మాట్లాడుతూ.. నీకు కాబోయే వరుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటూ సూటిగా అడిగేశారు. దీనికి సాయిపల్లవి సిగ్గుపడుతూ సమాధానం ఇచ్చింది.
తనకు కాబోయే వరుడు ముందుగా మంచి మనిషి అయ్యుండాలని ఆమె చెప్పింది. ఆ వ్యక్తికి మనమే గొప్ప అనే భావన ఉండకూడదని.. ప్రతి విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలని.. మనం ఏం చేస్తున్నామో ఆలోచించే చేసేలా ఉండాలని ఆమె అంది. తప్పులు ఎవ్వరైనా చేస్తారని.. కానీ వాటిని సరిదిద్దుకునేలా ఉండాలని ఆమె అభిప్రాయపడింది. తనను పెళ్లి చేసుకోవాలంటే.. ఎలాంటి లక్షణాలుండాలనే విషయంలో తనకు పెద్ద లిస్ట్ ఏమీ లేదని.. అతను బాగా వంట చేసేవాడైతే బెటర్ అనడంతో బిగ్-బితో పాటు ఆడియన్స్ కూడా గట్టిగా నవ్వేశారు.
మలయాళ మూవీ ‘ప్రేమమ్’తో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది సాయిపల్లవి. ఆ చిత్రంతో దక్షిణాదిన అంతటా మంచి గుర్తింపు సంపాదించింది. తర్వాత తెలుగులో ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం లాంటి చిత్రాలతో ఆకట్టుకుంది. తమిళంలో గార్గి, అమరన్ లాంటి స్పెషల్ ఫిలిమ్స్ చేసింది. ఇప్పుడు ఆమె ‘రామాయణం’తో హిందీ సినిమాలో అడుగుపెడుతోంది. ఈ చిత్రం గ్లోబల్ లెవెల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. నవంబరు 5న రిలీజ్ కాగా.. పది రోజుల ముందే యుఎస్‌లో రెడ్ కార్పెట్ ప్రిమియర్ వేయగా.. అక్కడ్నుంచి చాలా వరకు పాజిటివ్ టాకే వచ్చింది.
This post was last modified on October 29, 2026 12:18 pm
తెలుగు సినిమా చరిత్రలో లెజెండరీ స్టేటస్ ఉన్న కమెడియన్లు పదుల సంఖ్యలో ఉన్నారు. కానీ తమిళంలో హాస్య నటుల సంఖ్య…
సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ తర్వాత సోలో హీరోగా వెంకటేష్ నటించిన సినిమా ఆదర్శ…
సోషల్ మీడియా ఉంది కదాని బురద జల్లే వ్యవహారాలు ఈ మధ్య బాగా ఎక్కువైపోయాయి. ఎంతగా అంటే ఒకరిని లేదా…
అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేనిదే పనులు జరగడం లేదు. గతంలో రెవెన్యూ, రిజిస్ట్రార్,…
దసరాతో తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. న్యాచురల్ స్టార్ గా ఉన్న నానిని ఊర…
ఏపీ తుపాను సహాయక చర్యలలో సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. విద్యుత్ సిబ్బంది, సామగ్రి పంపేందుకు సిద్ధమైంది.…