ఒకే ఏడాదిలో మూడు థియేటర్ రిలీజులిస్తున్న స్టార్ హీరోగా సూర్య 2026లో పెద్ద ఘనతనే అందుకోబోతున్నాడు. కరుప్పు / వీరభద్రుడుతో ఊహించని బ్లాక్ బస్టర్ అందుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అందరూ చూస్తారాని అనుమాన పడిన విశ్వనాథ్ అండ్ సన్స్ తమిళం కన్నా ఎక్కువగా తెలుగులోనే పెద్ద విజయం అందుకుంది. కట్ చేస్తే మూడు నెలలు తిరగకుండానే సీన్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సూర్య ఈసారి కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
ఒరిజినల్ వెర్షన్ సెన్సార్ అయిపోయింది. 2 గంటల 29 నిమిషాల నిడివితో దర్శకుడు జీతూ మాధవన్ చాలా క్రిస్పీ రన్ టైంతో లాక్ చేశారు. మూడు గంటలకు పైగా లెన్త్ తో ఈ మధ్య చాలా సినిమాలు ఆడియన్స్ సహనాన్ని పరీక్షించాయి. కొన్ని వర్కౌట్ అయితే మరికొన్ని ఆ కారణంగా దెబ్బ తిన్నాయి. దీనికి ముందు అనుకున్న టైటిల్ కల్ట్. విశ్వక్ సేన్ రిజిస్టర్ చేసుకున్నాడని తెలిసి అడిగారట. కానీ తన కథకి వేరేది సూట్ కాదని చెప్పి తను నో చెప్పిన విషయం ఇటీవలే బయటికొచ్చింది.
ఇదిలా ఉండగా సీన్ సందడి గ్రౌండ్ లెవెల్ లో పెద్దగా కనిపించడం లేదు. అసలే పోటీలో రామాయణ 1 పార్ట్ ఉంది. అసలే పోటీలో రామాయణ 1 పార్ట్ ఉంది. ఏపీ తెలంగాణలో పంపిణి తీసుకున్న దిల్ రాజు పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే సీన్ నైజామ్ హక్కులు ఈయనవే కావడం ఇంకో ట్విస్టు. ఇంకో వైపు ఆదర్శ కుటుంబం రెండో వారం రన్నింగ్ లో ఉంటుంది. వీటిని ఫేస్ చేయడం అంత సులభంగా ఉండదు. తమిళనాడులో నయనతార మూకుతిఅమ్మన్ 2 (తెలుగులో మహాశక్తి)కి భారీ ప్రమోషన్లు చేస్తూ పెద్ద ఎత్తున స్క్రీన్లు లాక్ చేస్తున్న వైనం చెన్నై మీడియాలో సెన్సేషన్ అయ్యింది.
అయినా సరే సూర్య టీమ్ కూల్ గా ఉండటం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. విభిన్నమైన పోలీస్ ఆఫీసర్ గా సూర్య నటిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ లో నస్లెన్ విలన్ గా నటించడం విశేషం, నజ్రియా హీరోయిన్ కాగా సుషిన్ శ్యామ్ అందించిన సంగీతం మ్యూజిక్ లవర్స్ వెరైటీగా ఫీలవుతున్నారు. సీన్ లో సూర్యకు లెనిన్ తరహాలో ఒక ప్రత్యేక ట్విస్టు ఉంటుందట. ఒకవేళ సీన్ కూడా సక్సెస్ అయితే మటుకు సింగల్ ఇయర్ లో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న రికార్డు సూర్య ఖాతాలో చేరుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates