ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి సినిమాకు ప్రత్యేకంగా హైప్ కావాలా అనే సందేహం ఎవరికైనా రావొచ్చు. అందులోనూ నాటునాటు పాటకు ఆస్కార్ సాధించిన మూవీకి ఇప్పటికే బోలెడు గుర్తింపు ఉన్న నేపథ్యంలో వారణాసికి ఎలాంటి పరిచయం అక్కర్లేదని అభిమానులు భావించవచ్చు. జక్కన్న కూడా ఇలా ఆలోచిస్తే మాస్టర్ ఫిలిం మేకర్ ఎందుకవుతారు. ఆయన ప్లానింగ్, పద్దతి వేరు. ఎందుకంటే వారణాసి డ్రీం ప్రాజెక్టు. చాలా టార్గెట్లు పెట్టుకున్నారు.
ముందు ప్రకటించిన విడుదల తేదీ ఏప్రిల్ 7కి కట్టుబడి ఉండాలంటే రాజమౌళి టీమ్ చాలా పెద్ద సవాళ్ళను ఎదురు కోవాల్సి ఉంటుంది. ముందు థియేటర్ బిజినెస్ ఎంత చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. ఇప్పటికే పలువురు అగ్ర నిర్మాతలు హక్కుల కోసం పోటీ పడుతూ క్రేజీ ఆఫర్లు ఇస్తున్నప్పటికీ నిర్మాత కెఎల్ నారాయణ తొందరపడటం లేదు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ ఆశిస్తున్న దానికి, వచ్చిన రేట్ల మధ్య వ్యత్యాసం ఉండటం వల్ల డీల్స్ పెండింగ్ ఉన్నాయట.
మరోవైపు ఇంటర్నేషనల్ స్టూడియోలతో రాజమౌళి మంతనాలు జరుపుతున్నారట. ఆర్ఆర్ఆర్, బాహుబలి లాగా కాకుండా వారణాసిని వరల్డ్ వైడ్ ఒకేసారి రిలీజ్ చేయాలనేది ఆయన ఆలోచన. అలా చేస్తే ఓపెనింగ్ పరంగా కనివిని ఎరుగని రీతిలో అరుదైన రికార్డులు సొంతం చేసుకోవచ్చు. ఇదంతా కాస్త వేగంగా ముందుకు కదలాలంటే వారణాసి నుంచి మొదటి టీజర్ రావాలి. టైటిల్ లాంచ్ కోసం వదిలిన వీడియోలో ఒరిజినల్ విజువల్స్ లేవు. ఒక్క మహేష్ బాబు షాట్ మాత్రమే నిజమైంది.
ఇప్పుడు అసలు సినిమాలోని సీన్స్ తో కొత్త టీజర్ ఒకటి వదలాలి. మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంటే మటుకు ఇక్కడి బయ్యర్లేం ఖర్మ హాలీవుడ్ నుంచి కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. కార్తికేయ బృందం ప్రస్తుతం అదే పనిలో ఉందట. మహేష్ బాబు వెకేషన్ నుంచి రాగానే అయిదు నెలల పాటు దొరికే టైంలో ఎప్పుడెప్పుడు ప్రమోషన్లకు డేట్లు ఇవ్వాలనే కసరత్తుని కొలిక్కి తేబోతున్నారు. మ్యూజిక్ లాంచ్ ఘనంగా చేయబోతున్నారు. ఇప్పటికైతే రాజమౌళి మనసులో వాయిదా ఆలోచనైతే లేదట.
This post was last modified on October 28, 2026 7:19 pm
ఇంకొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 లో సీతగా నటించిన సాయిపల్లవి మీద చాలా కళ్లున్నాయి. తను…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల హవా కొనసాగింది. అక్కడ ఇక్కడా అని కాకుండా కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలోని అన్నీ ప్రాంతాల్లో…
ఎల్లుండి ఆదర్శ కుటుంబం, కల్ట్ తో పోటీ పడుతున్న చిన్న సినిమా కిల్లర్. పూర్వజ్ అనే దంపతులు పరిమిత బడ్జెట్…
మెగా ఫ్యాన్స్ అంత ఈజీగా మర్చిపోలేని డిజాస్టర్ గేమ్ ఛేంజర్. మూడేళ్ళ రామ్ చరణ్ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు…
అర్నబ్ తుఫాను ధాటికి తీర ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కాకినాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో…
వచ్చే నెల నవంబర్ 5 విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అంచనాలున్నాయో తెలిసిందే. నిర్మాత…