విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. ఈ ఇద్దరిలో ఎవరి సినిమా రిలీజైనా సోషల్ మీడియా హీటెక్కిపోవడం మామూలే. వాళ్లు చేసే సినిమాల ఫలితాల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ఇద్దరూ ఇటు మీడియాను, అటు ప్రేక్షకులను బాగా ఆకర్షించే వ్యక్తులు. సినిమా ఈవెంట్లో పాల్గొన్నా, ప్రెస్ మీట్ పెట్టినా.. ఇలా ఏం చేసినా హాట్ టాపిక్‌గా మారిపోతుంటారు.
అలాంటిది భార్యాభర్తలుగా మారాక ఇద్దరూ కలిసి చేసిన సినిమా ‘రణబాలి’ ఇటీవలే విడుదలైంది. ఇక వీళ్లిద్దరూ వార్తల్లో ఉండకుండా ఎలా ఉంటారు? సినిమా పరంగా గత రెండు వారాలుగా వీళ్లిద్దరి గురించి పెద్ద డిస్కషనే నడుస్తోంది. అది చాలదన్నట్లు ‘కాఫీ విత్ కరణ్’ లాంటి వివాదాస్పద షోలో ఇద్దరూ కలిసి పాల్గొనడంతో చర్చ ఇంకా పెద్దదైంది. ఐతే ఈ షోలో కొన్ని మాటలు, చర్యల వల్ల కొంత నెగెటివిటీ తప్పలేదు. ముఖ్యంగా రష్మిక ప్రపోజ్ చేస్తే ఏడాది పాటు విజయ్ ఒప్పుకోలేదని, రష్మిక అతణ్ని వందసార్లు అడగాల్సి వచ్చిందని చెప్పడం దుమారం రేపింది. విజయ్ మీద ఫెమినిస్టులు విరుచుకుపడిపోయారు.
దీని మీద రష్మిక చాలా ఎమోషనల్‌గా స్పందిస్తూ నిన్న పెట్టిన సోషల్ మీడియా పోస్టు వైరల్ అయింది. ఆమెకు తెలుగు వాళ్ల నుంచి గట్టి మద్దతే లభిస్తోంది. కానీ కన్నడిగులు మాత్రం రష్మికను దారుణంగా టార్గెట్ చేస్తుండడం గమనార్హం. విజయ్‌తో తన ప్రేమ, బాండింగ్ గురించి ఆమె ఎమోషనల్ అవుతుంటే.. దాని మీద కన్నడిగులు వెటకారంగా స్పందిస్తున్నారు.
గతంలో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకుని, తర్వాత రద్దు చేసుకోవడం.. అలాగే కన్నడ సినిమాల ద్వారా ఎదిగి తర్వాత తెలుగు సహా ఇతర భాషా చిత్రాలకు ప్రయారిటీ ఇవ్వడం.. ఎక్కడా తాను కన్నడ అమ్మాయిననే ప్రస్తావన తేకపోవడం, కన్నడ సినిమాల గురించి మాట్లాడకపోవడం గురించి వాళ్లు రష్మికను తప్పుబడుతూ.. ట్రోల్ చేస్తున్నారు. రష్మిక చుట్టూ వస్తున్న నెగెటివిటీకి ఆమె అర్హురాలే అని.. ఇదంతా తన స్థానికతను మరిచిపోవడం వల్ల తలెత్తిన పరిణామమే అని.. ఆమె మీద ఎవ్వరూ జాలి చూపించాల్సిన పని లేదని కన్నడిగులు కామెంట్లు పెడుతున్నారు. ఐతే వాళ్లకు తెలుగు వాళ్లు కొంచెం గట్టిగానే రిటార్ట్ ఇస్తూ రష్మికకు మద్దతుగా నిలుస్తుండడం విశేషం.
This post was last modified on October 27, 2026 3:24 pm
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మంచి అంచనాల మధ్య కొన్ని నెలల ముందు హీరోగా అరంగేట్రం చేశాడు ఘట్టమనేని…
నాలుగు దశాబ్దాలకు పైగా నటప్రస్థానంలో దర్శకులు ఆర్ నారాయణమూర్తి ఏనాడూ తన బాటను వీడింది లేదు. సమాజానికి సందేశాన్ని ఇచ్చే…
అక్టోబర్ నెలాఖరు థియేటర్ ఆడియన్స్ కి రెండు ఛాయిసులున్నాయి. ఒకటి వెంకటేష్ ఆదర్శ కుటుంబం ఏకె 47 కాగా రెండోది…
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో పాటు ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్…
టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్లలో నాగవంశీ ఒకడు. సోషల్ మీడియాలో ఆయన గురించి జరిగినంత చర్చ ఇంకెవరి మీదా జరగదు…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థుల నామినేషన్ లను కూటమి పార్టీల నేతలు, పోలీసులు, అధికారులు అడ్డుకుంటున్నారని…