అక్టోబర్ నెలాఖరు థియేటర్ ఆడియన్స్ కి రెండు ఛాయిసులున్నాయి. ఒకటి వెంకటేష్ ఆదర్శ కుటుంబం ఏకె 47 కాగా రెండోది విశ్వక్ సేన్ కల్ట్. రెండు వేర్వేరు విరుద్ధమైన జానర్లు కావడంతో ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. అయితే కాలు కదపకుండా ఇంట్లోనే వినోదం అందుకోవాలనే ప్రేక్షకులకు మాత్రం బోలెడు ఆప్షన్స్ ఊరిస్తున్నాయి. ఒకవేళ అన్నీ ఫస్ట్ డే చూడాలనుకుంటే మటుకు ఇరవై నాలుగు గంటలు సరిపోనంతగా ఓవర్లోడ్ కంటెంట్ ఇచ్చేందుకు ఓటిటిలు పోటీ పడుతున్నాయి.
కీర్తి సురేష్, రాధికా ఆప్టే, నటించిన లేడీ గ్యాంగ్ స్టర్ సిరీస్ ‘అక్క’ మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు మొదలయ్యాయి. యష్ రాజ్ నిర్మాణం కావడంతో హైప్ బాగానే బిల్డ్ అవుతోంది. విజయ్ సేతుపతి ‘బత్తా’ మనవాళ్ళు మిస్ అయినా తెలుగు డబ్బింగ్ తో ఎంచక్కా ఇంట్లోనే చూసేయొచ్చు. సందీప్ కిషన్ హీరోగా తమిళనాడు సిఎం విజయ్ కొడుకు సంజయ్ జేసన్ దర్శకత్వంలో వచ్చిన ‘సిగ్మా’ని, యూత్ కల్ట్ అంటూ హడావిడి చేసిన ‘తెల్ల కాగితం’ని బుల్లితెరపై చూసేందుకు రెడీ అవ్వొచ్చు.
ఆది సాయికుమార్ ‘ఇన్స్ పెక్టర్ యుగంధర్’ ఎప్పుడు వచ్చిందో తెలిసేలోపే థియేటర్స్ నుంచి మాయమైపోయింది. ఇప్పుడు అరచేతిలో చూసే ఛాన్స్ దక్కింది. రాజమౌళి సమర్పించిన ఫహద్ ఫాసిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’కి డిజిటల్ రీచ్ ఎక్కువగా ఉండే అవకాశాన్ని కొట్టి పారేయలేం. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ‘రుద్రవరం పీఎస్’ మీద కాసింత హైప్ అయితే కనిపిస్తోంది. జివి ప్రకాష్, కయదు లోహర్ జంటగా నటించిన ‘ఇమ్మోర్టల్స్’ సైతం స్మార్ట్ స్క్రీన్ మీద రుజువు చేసుకోవాల్సిందే.
ఇవి కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవన్నీ అక్టోబర్ 27 నుంచి 30 మధ్య వివిధ ప్లాట్ ఫార్మ్స్ వేదికగా జనాన్ని పలకరించబోతున్నాయి. ఈ మధ్య ట్రెండ్ ఎలా అయ్యిందంటే ఓటిటి రిలీజులు కూడా మొదటి వీకెండ్ లోనే వీలైనంత వ్యూస్ రాబట్టుకునేలా గురు శుక్రవారాలు టార్గెట్ చేస్తున్నాయి. తర్వాత నెమ్మదించిపోతున్నాయి. ఈసారి ఇంత ఓవర్లోడ్ ని డిజిటల్ మూవీ లవర్స్ ఎలా మోస్తారో, దేనికి పట్టం కడతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates