Movie News

బాలయ్య సినిమాకు సరికొత్త సంగీతం

ప్రస్తుతం దాదా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న బాలయ్య తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. దేవర 2 పట్టాలు ఎక్కే అవకాశాలు అంతకంతా తగ్గిపోతూ వెళ్లడంతో కొరటాల అబ్బాయిని వదిలేసి బాబాయ్ ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయిపోగా హడావిడి లేకుండా ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నారు. ఒకవేళ బాలయ్యకు ప్రమాదం జరగకపోయి ఉంటే ఈపాటికి ఈ కాంబినేషన్ సెట్స్ మీద ఉండేది. క్యాస్టింగ్ త్వరలోనే ఫైనల్ చేయబోతున్నారు.

ఈ మూవీకి సంగీత దర్శకుడిగా ముందు నుంచి వినిపిస్తున్న పేరు అనిరుధ్ రవిచందర్. గత కొన్నేళ్లుగా తమన్ తప్ప వేరే ఆప్షన్ లేనట్టుగా అఖండ నుంచి దాదా వరకు తమన్ తోనే అరడజను సినిమాలు చేయించుకున్నారు బాలకృష్ణ. ఇప్పుడు ఫ్రెష్ మ్యూజిక్ అవసరం ఉంది. అయితే అనిరుధ్ రెమ్యునరేషన్ కు ఈ సినిమాకు పెడుతున్న బడ్జెట్ కు పొంతన కుదరకపోవచ్చనే అనుమానం ఫిలిం నగర్ వర్గాల్లో లేకపోలేదు. అయితే అసలు నిజం ఇది కాదని తన కమిట్ మెంట్స్ వల్ల దీనికి సున్నితంగా నో చెప్పారట.

తాజా అప్డేట్ ప్రకారం అనిరుధ్ స్థానంలో ఆ ఛాన్స్ జివి ప్రకాష్ కుమార్ కి ఈ ఆఫర్ ఇవ్వొచ్చని తెలిసింది. రీజనబుల్ రెమ్యునరేషన్ తో పాటు పని వేగంగా చేస్తాడని పేరున్న ఈ మ్యూజిక్ సెన్సేషన్ నుంచి సరైన పాటలు రాబట్టుకుంటే మంచి అవుట్ ఫుట్ ఇస్తాడు. విశ్వనాధ్ అండ్ సన్స్ లాంటివి దీన్ని ఋజువు చేశాయి. అనిల్ రావిపూడి సైతం దేవిశ్రీ ప్రసాద్, భీమ్స్ ని కాదని జనవరి 12 విడుదలకి జివినే తీసుకున్నాడు. షూటింగ్ మొదలుపెట్టక ముందే మూడు పాటలు ఇచ్చేశాడు.

సో మంచి ఛాయస్ అవుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. కాకపోతే గుడ్డిగా నమ్మకం పెట్టుకోకుండా కొరటాల దగ్గరుండి మంచి ట్యూన్స్ రాబట్టుకోవాలి. పొలిటికల్ టచ్ ఉన్న యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ సినిమాలో బాలయ్య పాత్రకు రెండు షేడ్స్ ఉంటాయని అంటున్నారు. అది డ్యూయల్ రోలా లేక ఇంకేదైనా ట్విస్టు ఉందానే లీక్ ఇంకా బయటికి రాలేదు. డిసెంబర్ 24 విడుదల కాబోతున్న దాదా థియేటర్ బిజినెస్ మంచి ఊపు మీద ఉంది. వాయిదా పడే ఛాన్స్ లేనట్టే.

This post was last modified on October 26, 2026 10:42 pm

Share

Recent Posts

11 నెలల్లో 23 మరణ శిక్షలు – న్యాయమూర్తి బదిలీ

దేశంలో చాలామంది న్యాయమూర్తులు వున్నారు. వారిలో వేళ్ళ మీద లెక్కపెట్టగలిగిన వాళ్ళ పేర్లే ప్రజలకు తెలుసు. కానీ రవికుమార్ దివాకర్…

3 hours ago

గీత గోవిదం వదిలేశా… రంగస్థలంలో తీసేశారు

ప్రతి హీరో, హీరోయిన్ కెరీర్లో ఏవో కారణాలతో చేయలేకపోయిన సినిమాలు ఉంటాయి. అవి బాగా ఆడితే ఛాన్స్ మిస్సయిందే అని…

5 hours ago

చెన్నై ఆటోల్లో తిరుగుతున్న ఓజీ డైరెక్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసి, ఆయన కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ ఇచ్చిన డైరెక్టర్ అంటే ఒక రేంజ్…

6 hours ago

గరివిడి లక్ష్మి… ఇదేం విడ్డూరం

ఈ దసరాకి జైలర్-2, రణబాలి లాంటి భారీ చిత్రాలతో పాటుగా రెండు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. అందులో అనుపమ పరమేశ్వరన్…

6 hours ago

ఒక్కడి పని ముగ్గురు కుర్రాళ్లతో చేయిస్తున్న గంభీర్!

టీమ్ఇండియాలో హార్దిక్ పాండ్యా లేకపోతే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆ లోటు కనిపించేది. ముఖ్యంగా చివరి ఓవర్లలో భారీ షాట్లు…

7 hours ago

రైట్స్ తీసుకోకుండానే రీమేక్ షూటింగ్

ఏదైనా సినిమాను రీమేక్ చేయాలంటే ముందు రైట్స్ తీసుకోవాలి. ఆ తర్వాత స్క్రిప్టులో మార్పులు చేర్పులేమైనా అవసరం అనుకుంటే అవి…

8 hours ago