ప్రతి హీరో, హీరోయిన్ కెరీర్లో ఏవో కారణాలతో చేయలేకపోయిన సినిమాలు ఉంటాయి. అవి బాగా ఆడితే ఛాన్స్ మిస్సయిందే అని ఫీలవుతారు. వదులుకున్న సినిమాలు పోయాయంటే హమ్మయ్య అనుకుంటారు. పేరుకు మలయాళ అమ్మాయి అయినప్పటికీ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి, మంచి పేరు సంపాదించిన అనుపమ పరమేశ్వరన్.. తెలుగులో రెండు గోల్డెన్ ఛాన్సులు వదులుకుంది. అవే.. గీత గోవిందం, రంగస్థలం.
ఈ రెండు చిత్రాల్లో అనుపమనే నటించాల్సింది. కానీ ఏవో కారణాలతో ఆ సినిమాల్లో ఆమె చేయలేకపోయింది. ఆ రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్టయ్యాయో తెలిసిందే. ఈ చిత్రాలకూ కథానాయికగా తనను కన్సిడర్ చేసిన విషయం వాస్తవమే అని అనుపమ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. అందులో ఒకటి తాను వదులుకుంటే.. ఇంకో సినిమా నుంచి తనను తీసేసినట్లు ఆమె వెల్లడించింది.
‘గీత గోవిందం’ సినిమాలో కథానాయిక పాత్ర కోసం టీం తననే అనుకుందని, కానీ తానే ఆ సినిమాను రిజెక్ట్ చేశానని, అది తన మిస్టేకే అని అనుపమ చెప్పింది. ఐతే ఎందుకు ఆ సినిమాను వదులుకున్నది మాత్రం వెల్లడించలేదు. ఇక ‘రంగస్థలం’ హీరోయిన్ పాత్ర గురించి చెబుతూ, సుకుమార్ ముందు తనకే ఛాన్స్ ఇచ్చారని.. ఐతే ఆడిషన్ అదీ అయ్యాక తాను ఆ పాత్రకు సూటవ్వనేమో అనిపించి తనను పక్కన పెట్టారని చెప్పింది.
మరి ఎందుకు తనను తప్పించారని అడగలేదా, మళ్లీ ఆయనతో పని చేసే అవకాశం రాలేదా అని అడిగితే.. తాను అలా అడిగే నటిని కాదని.. సుకుమార్ నిర్మాణంలో ‘18 పేజెస్’ చేశా కాబట్టి తనేంటో ఆయనకు తెలుసని, ఏదైనా పాత్రకు సూటవుతానంటే ఛాన్స్ ఇస్తారని అనుపమ వ్యాఖ్యానించింది.
ఇక శర్వానంద్ ‘మహానుభావుడు’ సినిమాకు చర్చలు జరిగాయని.. తర్వాత తనతో ‘శతమానం భవతి’ సినిమా చేశానని అనుపమ చెప్పింది. ‘నేను లోకల్’ చిత్రానికి కూడా ఒక డిస్కషన్ జరిగినట్లు ఆమె వెల్లడించింది. ఛల్ మోహన్ రంగ, నిశ్శబ్దం, వి, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలను తాను వదులుకున్నట్లు జరిగిన ప్రచారాన్ని అనుపమ ఖండించింది.
This post was last modified on October 26, 2026 5:40 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసి, ఆయన కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ ఇచ్చిన డైరెక్టర్ అంటే ఒక రేంజ్…
ఈ దసరాకి జైలర్-2, రణబాలి లాంటి భారీ చిత్రాలతో పాటుగా రెండు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. అందులో అనుపమ పరమేశ్వరన్…
టీమ్ఇండియాలో హార్దిక్ పాండ్యా లేకపోతే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆ లోటు కనిపించేది. ముఖ్యంగా చివరి ఓవర్లలో భారీ షాట్లు…
ఏదైనా సినిమాను రీమేక్ చేయాలంటే ముందు రైట్స్ తీసుకోవాలి. ఆ తర్వాత స్క్రిప్టులో మార్పులు చేర్పులేమైనా అవసరం అనుకుంటే అవి…
కర్ణాటక సీఎం డీకే శివకుమార్ పై కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ…
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫిల్మోగ్రఫీలో ‘అరవింద సమేత’ చాలా స్పెషల్. ఎంటర్టైనర్లకు పేరుపడ్డ త్రివిక్రమ్.. ఈ సినిమాలో పూర్తిగా రూటు మార్చేశాడు.…