త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫిల్మోగ్రఫీలో ‘అరవింద సమేత’ చాలా స్పెషల్. ఎంటర్టైనర్లకు పేరుపడ్డ త్రివిక్రమ్.. ఈ సినిమాలో పూర్తిగా రూటు మార్చేశాడు. భారీ యాక్షన్‌కు తోడు.. మంచి మెసేజ్‌తో పూర్తి సీరియస్‌గా సినిమాను నడిపించి ప్రేక్షకులను మెప్పించాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా అద్భుతంగా నటించి మెప్పించాడీ సినిమాలో. తన కెరీర్లోనూ ఈ సినిమా చాలా ప్రత్యేకం.
ఐతే ఈ సినిమాలో కొన్ని కంప్లైంట్లు లేకపోలేదు. అందులో ముఖ్యమైంది ‘పెనిమిటి’ పాటను ప్లేస్ చేసిన విధానం. అది లేడీ క్యారెక్టర్ పాడాల్సిన పాట. కానీ తారక్ పాడడం అదోలా అనిపిస్తుంది. హీరో తల్లి పాత్రలో నటించిన దేవయాని పాడాల్సిన పాటను.. తారక్ పాడడం, అది కూడా అతను సిటీలోని ఒక రెస్టారెంట్లో ఆ సాంగ్ అందుకోవడం ఆడ్‌గా అనిపిస్తుంది.
ఐతే ఈ పాట విషయంలో ప్రేక్షకుల్లోనే కాదు.. త్రివిక్రమ్లోనూ అసంతృప్తి ఉందట. జగపతిబాబు నిర్వహించే టాక్ షోలో దీని గురించి మాట్లాడాడు త్రివిక్రమ్. ఆ పాట విషయంలో తప్పు జరిగిందని, ఆ మిస్టేక్ తనదే అని అంగీకరించాడు త్రివిక్రమ్. ‘పెనిమిటి’ చాలామందికి బాగా ఇష్టమైన పాట అని.. కానీ దాన్ని హీరో తల్లి పాత్రతో పాడించాల్సిందని.. తారక్ పాడడం బాగా లేదన్నది వాస్తవమని త్రివిక్రమ్ అన్నాడు. ఐతే టైట్ షెడ్యూల్స్ మధ్య పని చేయడం, ఎక్కువ టైం లేకపోవడంతో ఆ పాటను అలా కానిచ్చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పాడు.
కొంచెం టైం ఉంటే ఆ పాటను ఇంకా బాగా తీసేవాళ్లమన్నారు. ఈ చిత్రాన్ని 90 రోజుల వర్కింగ్ డేస్‌లోనే పూర్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా త్రివిక్రమ్ వెల్లడించాడు. ఇంత వేగంగా సినిమా చేయడానికి తారకే కారణమని.. అతను యాక్టింగ్ పవర్ హౌస్ అని కొనియాడాడు మాటల మాంత్రికుడు. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ కావడంతో త్రివిక్రమ్ మీద అందరూ నమ్మకం కోల్పోయిన టైంలో వచ్చిన ‘అరవింద సమేత’ పెద్ద హిట్టే అయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates