ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫౌజీ టీజర్ పెద్ద దుమారమే రేపేలా ఉంది. ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ని పొగుడుతూ సుభాష్ చంద్ర బోస్ ఏకంగా హిట్లర్ ముందు మాట్లాడటాన్ని ఆయన మునిమనవడు తీవ్రంగా తప్పు బడుతున్నారు. క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకోవచ్చు కానీ మరీ ఇంతగా కాదనేది అధిక శాతం చరిత్రకారులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం. అయితే ఇలా చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకోవడం హను రాఘవపూడి మొదటిసారి చేసింది కాదు. గతంలో ఎందరో దర్శకులు వాడుకున్నారు.
కాకపోతే ఫౌజీ ప్యాన్ ఇండియా మూవీ, అందులోనూ ప్రభాస్ చేసింది కావడంతో ఇంతగా హైలైట్ అవుతోంది. ఆ మాటకొస్తే భారతీయుడులో శంకర్ కూడా సుభాష్ చంద్ర బోస్ ని ఒక విజువల్ లో వాడారు. అప్పుడు ఎలాంటి అభ్యంతరం రాలేదు. సోషల్ మీడియా విస్తృతమయ్యింది కాబట్టి ఇంత చర్చ జరుగుతోంది కానీ ఒక పదేళ్ల క్రితం అయితే పరిస్థితి వేరుగా ఉండేదేమో. నిర్మాత రవిశంకర్ అన్నట్టు ముందు అనుకున్న ప్లాన్ ఏ టీజర్ వదిలి ఉంటే బాగుండేదేమోనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇది ప్రారంభం మాత్రమే. ఫౌజీ కథలో ఇండిపెండెన్స్ కు సంబంధించిన చాలా అంశాలున్నాయి. మహాత్మా గాంధీ లాంటి ఎందరో మహనీయుల రెఫరెన్సులు వాడుకున్నారు. ఆ పాత్రలను సీనియర్ ఆర్టిస్టులతో వేయించారు. వాళ్ళను ఎలా ప్రెజెంట్ చేశారనే దాన్ని బట్టి కొత్త కాంట్రావర్సీలు రావొచ్చు. ఇన్ సైడ్ లీక్ ప్రకారం ప్రభాస్ క్యారెక్టర్ చాలా పెద్ద ఫ్రీడమ్ ఫైటర్స్ తో ప్రయాణం చేస్తుందట. అది ఎవరికి ఇబ్బంది లేకుండా ఎంత కన్విన్సింగ్ గా ఉంటుదనేది తెరమీద చూడాలి.
అసలే విడుదల తేదీకి ఎక్కువ టైం లేదు. మార్చి 19 దూరంలో ఉన్నట్టు అనిపిస్తున్నా సరిగ్గా లెక్కేసుకుంటే కేవలం నాలుగున్నర నెలలు మాత్రమే ఉంది. ఒకపక్క ఇలాంటి వివాదాలను ఫేస్ చేస్తూ, విఎఫ్ఎక్స్ చెక్ చేసుకుంటూ, బ్యాలన్స్ షూటింగ్ టైంకి అయిపోయేలా ప్లాన్ చేసుకుంటూ, రిలీజ్ డేట్ చేరుకోవడం హను రాఘవపూడికి పెద్ద ఛాలెంజ్ కానుంది. ట్రైలర్ కట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఇంట్రో టీజర్ చూపించింది. దానికి తగ్గట్టు సిద్ధం చేయాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates