నిఖిల్ ఒక్కడే నిందలకు బాధ్యుడా

ప్యాన్ ఇండియా సినిమాలకు బజ్ కొనసాగాలంటే ఎప్పటికప్పుడు కొత్త సమాచారం ఇస్తూ ఒక టెంపో మెయింటైన్ చేయడం చాలా అవసరం. విశ్వంభరలో సాక్ష్యాత్తు మెగాస్టార్ చిరంజీవి ఉన్నా సరే ఆలస్యం వల్ల ఇప్పటికే బజ్ తగ్గిపోయి కమర్షియల్ ఫార్మలాతో రూపొందుతున్న కాకాకి ఎక్కువ హైప్ వచ్చేసింది. అలాంటిది నిఖిల్ లాంటి అప్ కమింగ్ స్టార్ కు ఈ పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పుడీ టాపిక్ కి కారణం స్వయంభు గురించి నిఖిల్ సిద్దార్థ్ తాజాగా ఇచ్చిన అప్డేట్.

ఇవాళ కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ చూశానని. అద్భుతంగా వచ్చాయని, వీటిని మీకు చూపించేందుకు తహతహలాడుతున్నానని చెబుతూ ట్వీట్ చేశాడు. ఈ ఏడాది రిలీజని అందులో పేర్కొన్నాడు తప్ప ఫలానా డేట్ అని కానీ, నెల అని కానీ అందులో లేదు. దీంతో స్వయానా ఫ్యాన్సే అసంతృప్తి వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. పైగా ఇమేజ్ లో ఉన్న నిఖిల్ ఫోటోలో ఏఐ వాడినట్టు ముఖకవళికలో తేడాని బట్టి పసిగట్టిన నెటిజెన్లు దాన్ని హైలైట్ చేసి మరీ కామెంట్స్ చేస్తున్నారు.

సరే సోషల్ మీడియా అన్నాక తప్పో ఒప్పో ఇలాంటివి వస్తూనే ఉంటాయి కానీ అసలు జాప్యానికి కారణం నిఖిలే అన్నట్టు ప్రొజెక్ట్ అవుతున్న విధానం మాత్రం సరి కాదనేది ఓపెన్ ఫ్యాక్ట్. నిర్మాణంలో తలెత్తిన సమస్యలు, విఎఫెక్స్ పనులు, ఓటిటి డీల్ ఇలా సవాలక్ష కారణాలు ఎన్నో ఉంటాయి. కానీ ఇవన్నీ ప్రేక్షకులకు అనవసరం. సమయానికి సినిమా వస్తే చూస్తారు, బాగుంటే ఆదరిస్తారు. ఇంతకు మించి తెరవెనుక ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి బుర్రలు బద్దలు కొట్టుకోరు.

కాకపోతే ఫలానా హీరో నుంచి ఫలానా సినిమా వస్తుందని తెలిశాక దానికోసం ఒక నిర్ణీత సమయం వరకు వెయిట్ చేస్తారు. ఆ ఓపిక తగ్గిపోయిన నాడు వేరే దాని కోసం ఎదురు చూస్తారు. స్వయంభు, విశ్వంభర, సంబరాల ఏటిగట్టు లాంటి చిత్రాల విషయంలో ఇది రిపీట్ గా జరుగుతూనే ఉంది. ఈ సంవత్సరంలో ఇంకో రెండు నెలలు మాత్రమే మిగిలున్నాయి. స్లాట్స్ చూస్తేనేమో ఖాళీ లేవు. మరి నిఖిల్ అన్నది నిజమే అయితే స్వయంభు ఎప్పుడు ముహూర్తం పెట్టుకుందో వేచి చూడాలి.