జైలర్ 2 బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. తమిళనాడులో అరాచకం స్పెల్లింగ్ రాయిస్తుండగా ఏపీ తెలంగాణలో స్ట్రాంగ్ గా ఉండటం అసలు విశేషం. కొన్ని చోట్ల దీని ఓవర్ ఫ్లోస్ ఇతర సినిమాలకు ఉపయోగపడటం అబద్దం కాదు. ప్రస్తుతం 700 కోట్ల వైపు పరుగులు పెడుతున్న ఈ సినిమా థియేటర్ రన్ పూర్తయ్యేలోపు వెయ్యి కోట్లను అందుకోవడం గురించి ట్రేడ్ వర్గాల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే బ్యాలన్స్ రావాలంటే ఇదే జోరు ఇంకో రెండు వారాలు కొనసాగించాలి.
కానీ ప్రాక్టికల్ గా చూసుకుతూనే జైలర్ 2 ఆ మైలురాయిని అందుకోవడం అసాధ్యం అనిపిస్తోంది. ఒకవేళ యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే లెక్క వేరే ఉండేది. ఈజీగా థౌజండ్ క్రోర్ మార్కు వచ్చి పడేది. కానీ మిశ్రమ స్పందన వల్ల దూకుడుని ఎక్కువ రోజులు కొనసాగించలేకపోతోంది. రజనీకాంత్ స్వాగ్, కొన్ని ఎపిసోడ్స్ బ్రహ్మాండంగా పేలడం, ఇంటర్వెల్ ఘట్టం బాగా వర్కౌట్ అయ్యాయి. ఒకవేళ మిగిలినవి ఇదే స్థాయిలో ఉంటే జైలర్ 1 లాగా రికార్డులు దాసోహమయ్యేవి.
చూస్తుంటే కోలీవుడ్ వెయ్యి కోట్ల కల అంత సులభంగా నెరవేరేలా లేదు. మన దగ్గర బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, పుష్ప 2 ది రూల్ , కల్కి 2898 ఏడి లాంటివి చాలా ఈజీగా ఆ ఘనతని సాధించగా ఎంత చేసినా తమిళంలో మాత్రం అలాంటి ల్యాండ్ మార్క్ మూవీ రావడం లేదు. సీఎం విజయ్ నటనకు గుడ్ బై చెప్పేశారు. అజిత్ అమావాస్యకో చేసే సినిమాలు అయిదు వందలు దాటడమే కష్టం. ఇక సూర్య లాంటి వాళ్ళు ఎంత బ్లాక్ బస్టర్ సాధించినా మహా అయితే మూడు వందల కోట్లని మించడం లేదు.
పొన్నియిన్ సెల్వన్ మీద పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. భవిష్యత్తులో ఎవరైనా చేయగలరా అంటే మళ్ళీ రజనీకాంత్ కే ఛాన్స్ ఉందనేది అభిమానుల నమ్మకం. వచ్చే ఏడాది రిలీజయ్యే ధర్మన్, కమల్ హాసన్ తో కలిసి నటించే మల్టీస్టారర్ ఈ రెండింటిలో ఏది అదిరిపోయిందనే టాక్ తెచ్చుకున్నా వెయ్యి కోట్ల కలని నిజం చేసుకోవచ్చు. లేదంటే లాంగ్ వెయిటింగ్ తప్పదు. ఒకవేళ రాకా కనక బైలింగ్వల్ విభాగంలో అట్లీ తమిళ వెర్షన్ కూడా తీశాడంటే అప్పుడు ఛాన్స్ ఉంటుంది. అది తెలుగు హీరో ద్వారానే సాధ్యమవుతుందేమో.
This post was last modified on October 25, 2026 6:54 pm
రణబాలి క్రమంగా నెమ్మదిస్తోంది. ఇప్పటిదాకా దసరా సెలవులు, రెండు వీకెండ్స్ క్యాష్ చేసుకోవడంలో సక్సెస్ ఆయిన విజయ్ దేవరకొండకు వరస…
హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జ ఎంచుకున్న సినిమాల్లో మిరాయ్ కూడా వంద కోట్ల క్లబ్బులో అడుగు పెట్టడంతో…
https://youtu.be/GBEMMz7D6C8?si=HbG0xf2skHBR-huG 2015 జూలై 14న గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన…
ఇంకో అయిదు రోజులో ఆదర్శ కుటుంబం ఏకే 47 విడుదల కానుంది. ముందు నుంచి కొంత నెగటివిటీ నడిచినప్పటికీ ట్రైలర్…
ఒకప్పుడు హీరోలకు షూటింగ్ లేని టైంలో వాళ్ళను కలుసుకునేందుకు అభిమానులు నేరుగా ఇళ్ల వద్దకు వెళ్ళేవాళ్ళు. స్టార్లు కూడా విసుక్కోకుండా…
పదేళ్ల కిందట ప్రేమమ్ సినిమాతో సౌత్ ఇండియా అంతటా విపరీతమైన పాపులారిటీ సంపాదించాడు మలయాళ నటుడు నివిన్ పౌలీ. ఆ…