రౌడీ మీద ఫోకస్ పెట్టే సమయం వచ్చింది

రణబాలి క్రమంగా నెమ్మదిస్తోంది. ఇప్పటిదాకా దసరా సెలవులు, రెండు వీకెండ్స్ క్యాష్ చేసుకోవడంలో సక్సెస్ ఆయిన విజయ్ దేవరకొండకు వరస డిజాస్టర్ల తర్వాత ఊరట దక్కిందని చెప్పాలి. అలాని అన్ని ఏరియాల్లో యూనానిమస్ గా ఒకే ఫలితం రాలేదు కానీ రిలీజ్ కు ముందు ఉన్న నెగటివిటీని తట్టుకుని ఇక్కడిదాకా రావడం విశేషమే. ఒకవేళ జైలర్ 2 పోటీ లేకపోయి ఉంటే ఇంకొంత మెరుగ్గా ఉండేది. ఉత్తరాంధ్రలో ఊహించని విధంగా గరివిడి లక్ష్మి ప్రభావం బలంగానే తాకింది.

ఇప్పుడు విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా రౌడీ జనార్ధన మీద ఫోకస్ పెట్టే టైం వచ్చింది. ఇది కూడా వయొలెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిందే. కాకపోతే గ్యాంగ్ స్టర్ నేపథ్యం ఉంటుంది. కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు తీసిన రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రణబాలి కొంచెం ఆలస్యం కావడం వల్ల ఇది లేటయ్యింది కానీ ముందు అనౌన్స్ చేసిన ప్రకారమైతే డిసెంబర్ లో థియేటర్ రిలీజ్ జరగాలి.

ఇంకా కీలక భాగం షూట్ బాలన్స్ ఉన్న రౌడీ జనార్ధన కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విజయ్ దేవరకొండ మీద మోతాదు మించిన యాక్షన్ ఎక్స్ ప్రెషన్స్ పలికించకుండా అర్జున్ రెడ్డి తరహాలో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ రాబట్టుకుంటూనే, రణబాలి లాగా ఇంటెన్స్ ఎపిసోడ్స్ డిజైన్ చేసుకోవాలి. కాకపోతే వయొలెన్స్ డోస్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. ప్యారడైజ్ విషయంలో శ్రీకాంత్ ఓదెల ఈ లెక్క తప్పడం వల్లే పరాజయాన్ని, ట్రోలింగ్ మూటగట్టుకోవాల్సి వచ్చింది.

ఎలా చూసినా రౌడీ జనార్ధన 2027 వేసవి కన్నా ముందు వచ్చే అవకాశం కనిపించడం లేదు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. స్లాంగ్ పరంగా విజయ్ దేవరకొండ దీనికి ప్రత్యేక కసరత్తు చేశాడు. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండకు మార్కెట్ పెరగాలంటే వీటి ద్వారా సక్సెస్ అందుకోవడం చాలా కీలకం. హిందీ మార్కెట్స్ ని టార్గెట్ చేయాలంటే రణబాలి లాగా ఫిఫ్టీ ఫిఫ్టీ అనిపించే కంటెంట్ ఇవ్వకూడదు. బెస్ట్ అనిపించుకోవాలి.