విజయ్ దేవరకొండ కొత్త సినిమా రణబాలికి ఆరంభంలో ఎంత నెగెటివ్ టాక్ వచ్చిందో తెలిసిందే. రివ్యూలు కూడా చాలా వరకు నెగెటివ్‌గానే వచ్చాయి. దీంతో సినిమా డిజాస్టర్ అవుతుందేమో అనుకున్నారంతా. కానీ నెమ్మదిగా టాక్ మారింది. జనం సినిమాను ఆదరించారు. దసరా సెలవుల అడ్వాంటేజీని ఈ చిత్రం బాగానే ఉపయోగించుకుంది. ఇంకా కూడా సినిమా ఓ మోస్తరుగా ఆడుతోంది.
ఐతే ట్రేడ్ ఈ సినిమా గురించి ఎవరేమన్నప్పటికీ.. తమ దృష్టిలో ఇది సూపర్ హిట్టే అని, రణబాలిని అలాగే పిలవాలని అన్నారు నిర్మాత రవిశంకర్ యలమంచిలి. రణబాలిని నిర్మించిన మైత్రి సంస్థ నుంచే ఈ వారం 418 అనే హార్రర్ మూవీ రిలీజైన సంగతి తెలిసిందే. దీని ప్రెస్ మీట్లో రవిశంకర్.. రణబాలి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రణబాలికి మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చిన మాట వాస్తవమే అని.. కానీ తాము ఇది మంచి సినిమా అని నమ్మామని, ఆ నమ్మకంతోనే వెయిట్ చేశామని.. అనుకున్నట్లే జనం ఈ సినిమాను ఆదరించారని రవిశంకర్ అన్నారు. సినిమా చూసిన ప్రేక్షకులందరూ బాగానే ఉంది కదా, దీని గురించి నెగెటివ్‌గా మాట్లాడారేంటి అనే అనుకున్నారని రవిశంకర్ చెప్పారు. రాయలసీమలో ఈ సినిమా ఎప్పుడో బ్రేక్ ఈవెన్ అయి లాభాలు కూడా అందిస్తోందని… ఇంకా మెజారిటీ ఏరియాల్లో బయ్యర్ల పెట్టుబడి వెనక్కి వచ్చేసిందని ఆయనన్నారు.
ఓవర్సీస్లో, ఇంకా ఒకట్రెండు ఏరియాల్లో మాత్రమే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వలేదని రవిశంకర్ చెప్పారు. పది ఏరియాల్లో ఎనిమిది చోట్ల బ్రేక్ ఈవెన్ అయిన సినిమాను సూపర్ హిట్ అనే అంటారని.. కాబట్టి మీడియా వాళ్లు కూడా తమ సినిమా గురించి అలాగే చెప్పాలని రవిశంకర్ తేల్చేశారు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన రణబాలిలో విజయ్ సరసన తన భార్య రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. ఇది దేశానికి స్వాతంత్ర్యం రావడానికి పూర్వం బ్రిటిష్ వారితో పోరాడిన ఒక యోధుడి కథతో తెరకెక్కింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates