Movie News

సినిమా కోసం కాలేజీకి సెలవా?

కాలేజీల్లో సినిమా ఈవెంట్లు చెయ్యడం ఈ మధ్య ట్రెండుగా మారింది. దాని వల్ల సినిమాలకు ప్రయోజనమేనా.. అదే సమయంలో కాలేజీల్లో సినిమా ఈవెంట్లు చేయడం వ్లల విద్యార్థులపై పడే చెడు ప్రభావం మాటేంటి అనే చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజీని సినిమా ఈవెంట్లకు అడ్డాగా మార్చేయడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు.

కొన్ని నెలల ముందు ‘టాక్సిక్’ ఈవెంట్ సందర్భంగా పరిస్థితులు అదుపు తప్పి విద్యార్థుల మధ్య తొక్కిసలాట కూడా చోటు చేసుకోవడం గమనార్హం. అప్పుడు వచ్చిన విమర్శలు సరిపోదని.. తాజాగా ఇదే కళాశాలలో ‘ఆదర్శ కుటుంబం’ ఈవెంట్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు మరింతగా విమర్శలకు దారి తీశాయి. ఈ ఈవెంట్లో మల్లారెడ్డి కోడలు, మల్లారెడ్డి కళాశాలల అధినేత ప్రీతి రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

‘ఆదర్శ కుటుంబం’ టీంను చూసి బాగా ఎగ్జైట్ అయిపోయిన ప్రీతిరెడ్డి.. ఈ సినిమా రిలీజ్ రోజు కాలేజీకి సెలవు ఇస్తున్నట్లు ప్రకటించేశారు. ముందు మీకు సెలవు కావాలా అని విద్యార్థులను ఉద్దేశించి అడిగిన ప్రీతిరెడ్డి.. వాళ్ల ఉత్సాహం చూశాక సెలవు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. పైగా ‘ఆదర్శ కుటుంబం’ సినిమా చూస్తానంటేనే సెలవు అని కూడా అన్నారు.

కాలేజీకి విద్యార్థులు వెళ్లేది చదువు కోసమని, వారిని ఇలాంటి సినిమా ఈవెంట్లలో భాగం చేయడమే తప్పంటే.. అది చాలదన్నట్లు సినిమా చూడడం కోసం కాలేజీకి సెలవు ఇస్తున్నట్లు ప్రకటించడం, అందరినీ సినిమా చూడమని చెప్పడం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కొందరు సామాజిక కార్యకర్తలు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబడుతూ.. మల్లారెడ్డి కళాశాల మీద చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ప్రీతి రెడ్డి చేసిన ప్రకటన విద్యార్థుల్లో ఉత్సాహం నింపొచ్చు కానీ.. తల్లిదండ్రులకు మాత్రం ఇది ఎంతమాత్రం రుచించే విషయం కాదు. ప్రీతి రెడ్డి వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతున్న నేపథ్యంలో ఇకపై మల్లారెడ్డి కాలేజీలో సినిమా ఈవెంట్లు జరుగుతాయా అన్నది కూడా సందేహమే. కాలేజీల్లో సినిమా ఈవెంట్లు చేయకూడదన్న డిమాండ్లు కూడా గట్టిగానే వినిపిస్తున్న నేపథ్యంలో మున్ముందు ఈ రకమైన ప్రమోషన్లు ఆగిపోవచ్చు.

This post was last modified on October 24, 2026 11:47 am

Share

Recent Posts

కాయితంకి కలిసి వస్తున్న వివాదాలు

చిన్న సినిమాలకు మార్కెటింగ్ చేసుకుని ఓపెనింగ్స్ వచ్చేలా ప్రేక్షకులని ప్రభావితం చేయడం నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారిపోయింది. దీంతో…

45 minutes ago

మన తెలుగులో ఎప్పటికి ఇలాంటి సినిమా రాదు

రాష్ట్రాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఆహార అలవాట్లు ఎలా వేర్వేరుగా ఉంటాయో సినిమాలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. గత…

1 hour ago

‘హనుమాన్’ను ఇబ్బందిపెట్టడంపై మహేష్ కోప్పడ్డాడా?

2024 సంక్రాంతి టైంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల భారీ సినిమా ‘గుంటూరు కారం’ మీద.. ‘హనుమాన్’ అనే చిన్న…

2 hours ago

హను పనితనం మీద ఇన్ని కామెంట్లా

టాలీవుడ్ దర్శకుల్లో వివాదాలకు దూరంగా కాసింత ఎక్కువ కల్ట్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుల్లో హను రాఘవపూడి ఒకరు. అందాల రాక్షసి…

3 hours ago

రామ్ చరణ్ సరసన కొత్త అందం?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘రంగస్థలం’ తర్వాత…

4 hours ago

రాహుల్ సలహా ఆచరణ సాధ్యమేనా

రణబాలి దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ అనంతపురంలో జరిగిన సక్సెస్ మీట్ లో ఒక మంచి విషయం చెప్పారు. ఇకపై బిజినెస్…

4 hours ago