మన తెలుగులో ఎప్పటికి ఇలాంటి సినిమా రాదు

రాష్ట్రాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఆహార అలవాట్లు ఎలా వేర్వేరుగా ఉంటాయో సినిమాలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. గత నెల విడుదలైన డోరతి తమిళనాడులో డీసెంట్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. విమర్శకులతో పాటు ఎందరో సెలబ్రిటీల ప్రశంసలు దక్కించుకుని టోరెంటో ఫిలిం ఫెస్టివల్ లో స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. తెలుగు డబ్బింగ్ చేసినప్పటికీ మార్కెటింగ్ లోపంతో పాటు ఇలాంటి కాన్సెప్ట్ ని మన ప్రేక్షకులు అంగీకరించలేకపోయారు. దీంతో ఫలితం దక్కలేదు.

తాజాగా డోరతి నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసింది. అన్ని ప్రధాన భాషల్లో అందుబాటులో పెట్టారు. డిజిటల్ లో చూసిన ఆడియన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పనితనాన్ని, సమాజం అంత సులభంగా ఒప్పుకోని ఒక సున్నితమైన అంశాన్ని ప్రెజెంట్ చేసిన విధానాన్ని మెచ్చుకుంటూ ట్వీట్లు వేస్తున్నారు. అలాని అంతా యునానిమస్ అని కాదు. నెగటివ్ గా రెస్పాండ్ అవుతున్న బ్యాచ్ లేకపోలేదు. ఇలాంటి ప్రయత్నాలు వేరే సంకేతాలు ఇస్తాయని వార్న్ చేస్తున్న వాళ్ళూ ఉన్నారు.

ఇదంతా ఎలా ఉన్నా మన తెలుగులో ఇలాంటి సినిమాలు తీసే సాహసం ఎవరూ చేయలేరని చెప్పాలి. ఎందుకంటే కమర్షియల్ మీటర్ లో వెళ్లే టాలీవుడ్ కథతో సహా ప్రతిదీ ఆ కోణంలోనే ఆలోచిస్తుంది. ఎవరికో సందేశం ఇవ్వాలనో లేదా ఒక కొత్త బ్యాక్ డ్రాప్ ని పరిచయం చేద్దామనో బాక్సాఫీస్ పరిమితులు దాటి ప్రయోగాలు చేస్తే రివర్స్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే లెస్బియన్ గా మమ్ముట్టి నటించగలరు కానీ మన స్టార్ సీనియర్లు కనీసం ఆ ఆలోచన కూడా చేయరు.

ఇక్కడ ఎవరిని తప్పుబట్టడానికి లేదు. మార్కెట్, జనాల అభిరుచులను బట్టి సినిమాలు రూపొందుతాయి కానీ స్వంత భావజాలాల మీద కాదు. తమిళ మలయాళంలో ప్రయోగాలు అధిక శాతం జరగడానికి కారణం ఇదే. కొన్ని ఆదరణ పొందుతాయి, కొన్ని ప్రశంసలకు పరిమితమవుతాయి. కీర్తి సురేష్ చేసింది తక్కువ నిడివి పాత్రే అయినా మార్కెటింగ్ కి బాగా ఉపయోగపడింది. ఇళయరాజా సంగీతం సినిమాకు మరింత ప్లస్సయ్యింది. ఇప్పుడీ సినిమా తీసిన కార్తీక్ సుబ్బరాజే చిరంజీవికో కథ చెప్పి వెయిటింగ్ లో ఉన్నారు.