స‌లార్-2 అప్‌డేట్ నమ్మొచ్చా?

పాన్ ఇండియా స్థాయిలో సూప‌ర్ స్టార్ అయినా.. త‌న ప్ర‌తి సినిమా స్కేల్, కాన్వాస్, బ‌డ్జెట్లు చాలా పెద్ద‌వే అయినా విరామం లేకుండా సినిమాలు చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు ప్ర‌భాస్. త‌న రేంజి సూప‌ర్ స్టార్ల‌లో, అంత భారీ చిత్రాలు చేస్తూ కూడా ఏటా ఒక రిలీజ్ అయినా ఉండేలా చూసుకుంటున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో రాజాసాబ్‌తో ప‌ల‌క‌రించిన ప్ర‌భాస్.. డిసెంబ‌రులో ఫౌజితో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌నుకున్నాడు. కానీ కుద‌ర‌లేదు.

ఆ సినిమా ఆల‌స్యం కావ‌డంతో ప్ర‌భాస్ చేతిలో ఉన్న మిగ‌తా సినిమాల మీద కూడా ప్ర‌భావం ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే క‌ల్కి-2, స‌లార్-2 లాంటి క్రేజీ సీక్వెల్స్ కూడా ఆల‌స్యం అవుతున్నాయి. ఫౌజీ, స్పిరిట్ పూర్తి చేసి.. క‌ల్కి-2 కూడా ప‌ని కూడా మొద‌లుపెట్టేస‌రికి పుణ్య‌కాలం గ‌డిచిపోతుంద‌ని.. వ‌చ్చే ఏడాది స‌లార్-2 ఊసే ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అంతా అనుకుంటున్నారు.

కానీ ఆశ్చ‌ర్య‌క‌రంగా స‌లార్-2 అప్‌డేట్ ఇచ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్. శుక్ర‌వారం ప్ర‌భాస్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్‌ను క‌లిసి విష్ చేయ‌డంతో పాటు త‌న ప్రొడ‌క్ష‌న్లో వ‌చ్చిన 418 మూవీకి కొంచెం ప్రమోషన్ కూడా చేసుకున్నాడు ప్ర‌శాంత్. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ప్ర‌శాంత్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌గానే.. గిఫ్ట్ ఎక్క‌డ అని అడిగాడు ప్ర‌భాస్. రాత్రికి ఇస్తాన‌ని ప్ర‌శాంత్ చెప్ప‌గా.. ఇంత‌కీ స‌లార్-2 ఎప్పుడు అని ఇంకో ప్ర‌శ్న వేశాడు ప్ర‌భాస్. దానికి బ‌దులిస్తూ వ‌చ్చే జూన్‌లో మొద‌ల‌వుతుంద‌ని ప్ర‌శాంత్ తెలిపాడు.

ప్ర‌స్తుతం ప్ర‌శాంత్.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో తీస్తున్న డ్రాగ‌న్ మూవీ ఆ నెల‌లోనే రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చాలా ఆల‌స్యం అయిన ఆ సినిమాను ఇంత‌కుమించి వాయిదా వేసే అవ‌కాశం లేద‌ని, జూన్‌లో ఆ మూవీని రిలీజ్ చేసి, స‌లార్-2ను మొద‌లుపెట్టేస్తాన‌ని చెప్ప‌క‌నే చెప్పేశాడు ప్ర‌శాంత్. ఎన్టీఆర్‌కు కొన్ని నెల‌ల ముందు గాయమ‌వ‌గా.. అప్పుడు వ‌చ్చిన గ్యాప్‌లో ప్ర‌శాంత్ స‌లార్-2 స్క్రిప్టు, ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చూసుకున్నాడు. కాబ‌ట్టి డ్రాగ‌న్ రిలీజ‌య్యాక అత‌ను ఏమాత్రం ఆల‌స్యం చేసే అవ‌కాశం లేద‌న్న‌మాట‌.