Movie News

పోలికల పంచాయితీలు ఆపేస్తే బెటర్

రాను రాను సోషల్ మీడియా మరీ టాక్సిక్ అవుతోందని కొందరు సినీ ప్రముఖులు చెప్పే మాట నిజమే అనిపిస్తుంది. జైలర్ 2 విడుదలయ్యాక చిరంజీవి లాంటి సీనియర్ హీరోలు అలాంటి పాత్రలు చేయడం లేదని గగ్గోలు పెట్టే బ్యాచ్ గత వారం రోజులుగా ఎక్స్ వేదికగా తెగ పాఠాలు బోధిస్తోంది. నిన్న అల్లు అర్జున్ చొక్కా నలగకుండా రజని అయిదు వందల కోట్లు దాటారని మెచ్చుకుంటే ఆ స్టేట్ మెంట్ ని కూడా పోస్ట్ మార్టం చేసిన మేధావుల బ్యాచులు ఆన్ లైన్ ప్రపంచం నిండా ఉన్నాయి.

ప్యారడైజ్ ఓటిటిలో వచ్చాక వేలు లక్షల్లో ట్రోల్స్ జరుగుతున్నాయి. తనకు రాజా సాబ్ ఇచ్చిన ప్రభాస్ కి దర్శకుడు మారుతీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే దాని మీద కొందరు ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. సంబంధం లేని విషయాల్లో హరీష్ శంకర్ ని తీసుకొచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ ని గుర్తు చేస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు రోజుకు కొందరు తారసపడుతూ ఉంటారు. టాలీవుడ్ జనాలకు ప్రోగ్రెసివ్ థింకింగ్ లేదంటూ మలయాళ సినిమాలను భుజాన మోసే వాళ్ళు రోజు వందల్లో ఉంటారు.

ఇది క్రమంగా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఆఖరికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇంటర్వ్యూలను కూడా శల్యపరీక్ష చేసి కామెంట్లు గుప్పిస్తున్న వాళ్ళ సంఖ్య అంతకంతా బియ్యం ధరలా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఒకప్పుడు వీటిని సీరియస్ గా తీసుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు తత్వం అర్థం చేసుకుని నెగటివిటీని ఎదురుకునే మంచి కంటెంట్ ఇవ్వాలని, విమర్శలను ఎక్కువ పట్టించుకుంటే వేస్టనే అభిప్రాయానికి వచ్చేశాడు. నిజానికి ఇప్పుడు కావాల్సింది ఇలాంటి పాజిటివిటీనే.

ఆఖరికి ఇడుపు కాగితం టైటిల్ కూడా వివాదానికి దారి తీయడం కొన్ని నెలల క్రితం ఎవరూ మర్చిపోని ఉదంతం. సరే ఎవరి గోల వారిదని ఎక్స్, ఇన్స్ టా మాధ్యమాలని నిర్లక్ష్యం చేయడానికి లేదు. ఎందుకంటే ఒక మంచి సినిమాకు దన్నుగా నిలిచి దాని కలెక్షన్లు పెంచడంలో వీటి పాత్ర అధికంగానే ఉంటుంది. అందుకే స్టార్ల నుంచి పిఆర్ వ్యవస్థ దాకా అందరూ వీటిని ఇష్టం ఉన్నా లేకపోయినా భరించాల్సిన పరిస్థితి తలెత్తింది. కాకపోతే ఈ పోలికల పర్వానికి బ్రేక్ ఇస్తే అందరికీ మంచిది.

This post was last modified on October 23, 2026 6:38 pm

Share

Recent Posts

కల్ట్‌కు వచ్చే అసలు కష్టం అదే

విశ్వక్ సేన్ కల్ట్ అక్టోబర్ 30 విడుదలకు రెడీ అవుతోంది. ఆదర్శ కుటుంబంతో పోటీ ఎందుకు లెమ్మని ఇట్లు అర్జున,…

43 minutes ago

గరివిడి గర్వంగా చెప్పుకునే విషయమిది

జైలర్ 2, రణబాలి లాంటి క్రేజీ సినిమాలతో పోటీ పడి చాలా పెద్ద రిస్కు చేసిన గరివిడి లక్ష్మి రికార్డులు…

1 hour ago

వైసీపీ అభ్యర్థుల సంతకం ఫోర్జరీ

ఏపీలో మొత్తం 19 చోట్ల నామినేషన్ల గడువు పొడిగించాలని సుప్రీం కోర్టును వైసీపీ ఆశ్రయించింది. అయితే, కేవలం 4 స్థానాల్లో…

5 hours ago

పెద్ద నిర్మాతలు పెద్ద మనసు చేసుకోలేరా

టాలీవుడ్ లో ఇప్పుడో టాపిక్ తీవ్ర చర్చకు దారి తీస్తోంది. పెద్ద హీరోల సినిమాలు పదే పడే వాయిదా వేసుకోవడం…

5 hours ago

ఆ సినిమా ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే..

ప్రేమద ఊరలి.. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన కన్నడ చిత్రమిది. గత నెల ఈ సినిమా రిలీజైనపుడు మొదట్లో…

6 hours ago

జగన్ ఇల్లు ఏమైనా ఫంక్షన్ హాలా?

ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కుమార్తె వివాహం నవంబరు 25న జరగనుంది. ఈ పెళ్లిని బెంగుళూరులోని జగన్ నివాసంలో జరపాలని షర్మిల…

7 hours ago