తరుణ్ భాస్కర్ వెనుక మూణ్నెల్లు తిరిగిన విశ్వక్

‘పెళ్ళిచూపులు’ లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన తరుణ్ భాస్కర్.. తర్వాత దశాబ్ద కాలంలో దర్శకుడిగా రూపొందించింది రెండే సినిమాలు. కానీ నటుడిగా మాత్రం డబుల్ డిజిట్ సినిమాలు చేశాడతను. ‘ఫలక్‌నుమా దాస్’లో తరుణ్ చేసిన పోలీస్ పాత్ర బాగా క్లిక్ అవడంతో తనకు నటుడిగా అవకాశాలు వరుస కట్టాయి.

తరుణ్హీ రోగా కూడా ఓం శాంతి శాంతి శాంతి:, గాయపడ్డ సింహం లాంటి చిత్రాలు చేశాడు. ఐతే నటుడిగా ఇప్పుడు ఇంత బిజీగా ఉన్న అతను.. తొలి అవకాశం ఇచ్చినపుడు మాత్రం అంతగా ఆసక్తి చూపించలేదట. ఏకంగా మూడు నెలల పాటు వెంట పడి అతి కష్టం మీద అతణ్ని ఒప్పించాడట విశ్వక్. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు విశ్వక్.

‘‘ఫలక్‌నుమా దాస్‌లో ఎస్ఐ పాత్ర చేయమంటే తరుణ్ ఒప్పుకోలేదు. ఎన్నిసార్లు అడిగినా.. నటన తనకు సూటవ్వదనే చెప్పాడు. తనకు ఇంట్రెస్ట్ లేదనే చెప్పాడు. మూడు నెలల పాటు తన వెంట తిరిగా. చివరికి ఒక రోజు అన్నపూర్ణ స్టూడియోలో ఏదో ఫొటో షూట్ జరుగుతుంటే వెళ్లా. అక్కడికి వెళ్లి తరుణ్‌కు బిస్కెట్ ఇచ్చా. ఏంటిది అని అడిగితే.. నువ్వు నాకు బిస్కెట్ ఇచ్చావు కదా, అందుకే నేనూ ఇస్తున్నా అన్నాను.

తర్వాత తరుణ్ కొంచెం ఆలోచించి సరే చేస్తాలే పో అన్నాడు. అప్పుడు ఇష్టం లేకుండానే ఆ పాత్ర చేశాడు. కానీ ఇప్పుడు యాక్టింగ్ ఆపమన్నా ఆపట్లేదు. తరుణ్ తన దగ్గరికి వచ్చే ఎవరినీ అగౌరవపరచడు. తాను ఆపలేని స్థాయిలో ఆఫర్లు వస్తున్నట్లున్నాయి. అందుకే చేస్తున్నాడు. తరుణ్ దగ్గరికి వెళ్లి ఎవరైనా కొంచెం దీనంగా ఫేస్ పెట్టి తమ కష్టాలు చెప్పుకుంటే చాలు.. సినిమా చేసేస్తాడు. అందరూ తన దగ్గర ఆ స్విచ్‌యే ఆన్ చేస్తున్నట్లున్నారు’’ అని తరుణ్ భాస్కర్ చమత్కరించాడు.