హీరో, హీరోయిన్ ఎవరైనా సక్సెస్ ఎక్కువ కాలం లేకపోతే ఆటోమేటిక్ గా రేసులో వెనుకబడటం జరుగుతుంది. అందులోనూ పెళ్ళయిపోతే ఇక చెప్పేదేముంది. కానీ కీర్తి సురేష్ కేసు వేరు. డిజాస్టర్లు క్యూ కట్టినా సరే అవకాశాలకు లోటు లేకుండా కెరీర్ నిక్షేపంగా ముందుకు వెళ్తోంది. వచ్చే వారం అక్టోబర్ 30 నెట్ ఫ్లిక్స్ వేదికగా తను నటించిన వెబ్ సిరీస్ అక్క స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటిదాకా పెద్దగా సౌండ్ లేదు కానీ ట్రైలర్ వచ్చాక అంచనాలు ఏర్పడేలా కంటెంట్ ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది.
ఎనభై దశకంలో పెరూర్ అనే ప్రాంతం మహిళల ఆధిపత్యంలో ఉండేది. తమ నేర సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి దేనికైనా తెగించే జాతిలో పుట్టిన ఒక యువతికి, ముంబై డాన్ల ప్రోత్సాహంతో అక్కల కోటను బద్దలు కొట్టేందుకు వచ్చిన ఒక లేడీ క్రిమినల్ కు మధ్య జరిగే యుద్ధం ఆధారంగా దర్శకుడు ధర్మరాజ్ శెట్టి దీన్ని రూపొందించారు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణం కావడంతో ప్రొడక్షన్, ఆర్ట్ వర్క్, క్యాస్టింగ్, విజువల్స్ అన్నీ రిచ్ గా ఉన్నాయి. ఆడియన్స్ లో అంచనాలు రేపెలా కుదిరాయి.
దీని సంగతలా ఉంచితే కీర్తి సురేష్ కు గత కొన్నేళ్లలో కనీస హిట్టు లేకపోవడం గమనించాల్సిన విషయం. రివాల్వర్ రీటా, ఉప్పు కప్పురంబు, బేబీ జాన్, రఘు తాత, సైరన్, భోళా శంకర్, గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా ఒకదాన్ని మించి మరొకటి దారుణంగా దెబ్బ కొట్టాయి. ఒక్క నాని దసరా మాత్రమే చెప్పుకోదగ్గ విజయం సాధించింది. ఇటీవలే స్పెషల్ సాంగ్ చేసిన ప్యారడైజ్ సైతం ఏ లిస్టులో చేరిందో చెప్పనక్కర్లేదు. ట్విస్ట్ ఏంటంటే మహానటి రాబోయే లిస్టు కూడా పెద్దదే ఉంది.
విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధనలో కీర్తి సురేషే మెయిన్ హీరోయిన్. జనవరి 12 విడుదలలో వెంకటేష్ సరసన ఛాన్స్ కొట్టేసింది. త్వరలో సత్యవన్ సావిత్రి రిలీజ్ కానుంది. మలయాళం తమిళంలో ఇంకో రెండు నిర్మాణంలో ఉన్నాయి. బేబీ జాన్ పోయినా హిందీలో రఫ్తార్ లాంటి క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యింది. సో మూడు ముళ్ళు పడ్డాక కూడా కీర్తి సురేష్ కు ఖాళీ లేదన్న మాట. మరి అక్క కనక బ్రేక్ ఇస్తే తొలిసారి కీర్తి సురేష్ మాస్ వయొలెంట్ అవతారాన్ని ఎంజాయ్ చేయొచ్చు.
This post was last modified on October 22, 2026 4:53 pm
ఒకే నెలలో రెండు డేట్లు మార్చుకున్న ఆదర్శ కుటుంబం ఏకే 47 ఫైనల్ గా అక్టోబర్ 30 లాక్ చేసుకున్న…
ఇంకా థియేటర్లలోనే రిలీజ్ కాలేదు. అప్పుడే ఓటీటీలో సినిమాను చూడ్డం గురించి చర్చేంటి అనిపిస్తోందా? ఐతే ‘రామాయణం’ సినిమా మేకర్స్…
2027 సంక్రాంతికి ఏ చిరంజీవి సినిమా విడుదలవుతుందనే దాని మీద మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలయ్యిందని మెగా కాంపౌండ్ టాక్. జనవరి…
రాష్ట్రంలో ఫేక్ రాయుళ్ళు బరితెగిస్తున్నారు. ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే కుట్రలకు పాల్పడుతున్నారు. కూటమి…
క్రికెట్లో బ్యాటుకు బంతి తగిలిందో లేదో తెలుసుకోవడానికి థర్డ్ అంపైర్లు టెక్నాలజీ సాయం తీసుకుంటారు. ముఖ్యంగా వికెట్ కీపర్ క్యాచ్…
కూటమిలో కుంపటి పెట్టేందుకు వైసీపీ నేతలు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరు. టీడీపీ, జనసేనల మధ్య చిన్న నిప్పు రవ్వ…