Movie News

లిటిల్ హార్ట్స్ మౌళికి టీవీ ఛానెల్ బ్లాక్‌మెయిల్

యూట్యూబ్‌లో ఫ‌న్నీ వీడియోలు చేసుకునే మౌళి.. నైంటీస్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌తో త‌న టాలెంట్ ఏంటో చూపించాడు. ఇక అత‌ను హీరో అవ‌తారం ఎత్తిన లిటిల్ హార్ట్స్ మూవీ గ‌త ఏడాది ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. 2 కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా కాస్తా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 40 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది.

ఇప్పుడు మౌళి నుంచి దొంగ‌నాకొడుకు సినిమా రాబోతోంది. ఈ రోజే రిలీజైన దీని టీజ‌ర్ యూత్‌ను బాగానే ఆక‌ట్టుకుంటోంది. ఈ టీజ‌ర్ లాంచ్ సంద‌ర్భంగా మౌళి.. కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల గురించి మాట్లాడాడు. ఈ మ‌ధ్య ఒక టీవీ ఛానెల్ యాంక‌ర్ త‌నను ఉద్దేశించి అవ‌మానించేలా మాట్లాడ్డం.. అలాగే ఇంకో టీవీ ఛానెల్ ప్ర‌తినిధి త‌న‌ను బ్లాక్‌మెయిట్ చేయ‌డం గురించి కూడా అత‌ను స్పందించాడు.

ముందుగా త‌న గురించి ఒక యాంక‌ర్ అవ‌మాన‌కంగా మాట్లాడ్డం గురించి మౌళి మాట్లాడుతూ.. ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన వ్య‌క్తి గురించి అయితే అలాంటి కామెంట్ చేసేవాడా అని ప్ర‌శ్నించాడు. ఆ వీడియో చూసి తాను బాధ‌ప‌డ్డాన‌ని, కానీ ఏం చేయ‌గ‌లం అని అత‌ను ఒకింత నిర్వేదంతో మాట్లాడాడు.

ఆ టైంలో స్పందించ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని ఊరుకున్నట్లు అత‌ను చెప్పాడు. లిటిల్ హార్ట్స్ రిలీజ‌య్యాక చాలామంది ర‌క‌ర‌కాలుగా మాట్లాడార‌ని.. కొంద‌రు అసూయ ప‌డ్డార‌ని, త‌న గురించి త‌ప్పుగా కామెంట్ చేశార‌ని, అదే స‌మ‌యంలో త‌న‌కు స‌పోర్ట్ కూడా వ‌చ్చింద‌ని మౌళి తెలిపాడు.

ఇక తాను ఎదుర్కొన్న బ్లాక్‌మెయిల్ గురించి మౌళి చెబుతూ.. లిటిల్ హార్ట్స్ రిలీజ‌య్యాక ఒక టీవీ ఛానెల్ ప్ర‌తినిధి ఒక ప్రోగ్రాంకు పిలిచాడ‌ని.. ఐతే అప్పుడు త‌న‌కు జ్వ‌రం ఉంద‌ని చెబితే.. అవునా, అయితే రావా, అలా అయితే నీ త‌ర్వాతి నెగెటివ్ అవుతుందేమో చూస్కో అని నేరుగా ముఖం మీదే అన్నాడ‌ని వెల్ల‌డించాడు. దీంతో ఒంట్లో బాలేకున్నా, భ‌యంతో ఆ ప్రోగ్రాంకు వెళ్లాన‌ని.. భ‌య‌పెడితే భ‌య‌ప‌డ‌తాం, తిడితే ప‌డ‌తాం, అంత‌కంటే ఏం చేస్తాం అని అత‌ను వ్యాఖ్యానించాడు. దొంగ‌నాకొడుకు న‌వంబ‌రు 13న ప్రేక్ష‌కుల ముందుకు రానున‌న్న సంగ‌తి తెలిసిందే.

This post was last modified on October 21, 2026 10:03 pm

Share

Recent Posts

ప్రేక్షకులను ఎక్కువ గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు

ఒకప్పుడు ఆషామాషీ గ్రాఫిక్స్ తో సినిమా తీసినా చెల్లిపోయేది. స్క్రీన్ ప్లే మేజిక్, మంచి పాటలు పడితే ఎఫెక్ట్స్ లోపాలు…

45 minutes ago

శత్రువుకు శత్రువు మనకు మిత్రుడే

ఏపీలో సుమారు 12 కార్పొరేష‌న్ల స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. వీటిలో రెండేరెండు కార్పొరేష‌న్లకు సంబంధించిన చ‌ర్చ జోరుగా సాగుతోంది.…

1 hour ago

గాజు గ్లాసుకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్

ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు పార్టీ సింబల్ ఎంతో ముఖ్యం. అందుకే, పార్టీ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రతి రాజకీయ…

3 hours ago

‘దొంగ నా కొడుకు’ వద్దంటే… ‘నా కొడుకు దొంగ’

ఈ మధ్య సెన్సార్ బోర్డు విన్యాసాలు మామూలుగా ఉండట్లేదు. చిత్ర విచిత్రమైన కారణాలు చెప్పి.. చిన్న సినిమాలకు చుక్కలు చూపిస్తున్నారు…

3 hours ago

జిల్లాల పోరు జ‌గ‌న్‌కు క‌లిసి వ‌చ్చేనా?

మునిసిప‌ల్‌, న‌గ‌ర పాల‌క సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ వైసీపీ నేత‌ల హ‌డావుడి అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత…

4 hours ago

నరసింహా సీక్వెల్… నమ్మొచ్చా

సౌత్ ఇండియన్ సినిమాలో సీక్వెల్, ఫ్రాంఛైజీల సక్సెస్ రేట్ తక్కువ అయినప్పటికీ.. అప్పుడప్పుడూ ఓ చిత్రం పెద్ద హిట్టయి ఆ…

6 hours ago