దసరా సెలవులు రణబాలికి చాలా ప్లస్ అయ్యాయి. రిలీజ్ రోజు ప్రాథమికంగా వచ్చిన పబ్లిక్ టాక్, సోషల్ మీడియా రెస్పాన్స్ ఏమంత ఆశాజనకంగా లేకపోయినా దాన్ని తట్టుకుని మరీ వసూళ్లు రాబట్టుకోవడంలో విజయవంతమయ్యింది. ట్రేడ్ టాక్ ప్రకారం ఇప్పటిదాకా యాభై కోట్ల గ్రాస్ దాటేసిన రణబాలి ఇంకో యాభై దాకా తెస్తే బ్రేక్ ఈవెన్ టచ్ చేయొచ్చు. బడ్జెట్ ఎక్కువ కావడంతో బిజినెస్ కూడా దానికి తగ్గట్టే జరిగింది. లేదంటే ఈపాటికే లాభాల్లోకి అడుగు పెట్టేదని బయ్యర్ వర్గాల సమాచారం.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సినిమా కోసం పర్సనల్ గా ప్రమోషన్లు చేసుకుంటున్నారు. గుళ్లకు, ఈవెంట్లకు, కాలేజీలకు వెళ్తూ వీలైనంత ఎక్కువ అభిమానులను కలుసుకుంటున్నారు. సెట్ కి ఫ్యాన్స్ ని పిలిపించి స్పెషల్ ప్రోగ్రాం చేశారు. బతుకమ్మ వేడుకలో హాజరయ్యారు. ఇలా ప్రతి చోట ఈ జంట దర్శనం ఇవ్వడం కొందరు ప్రతికూలంగా తీసుకున్నా కామన్ ఆడియన్స్ లో మటుకు అటెన్షన్ వచ్చేందుకు హెల్పయ్యింది. అందులోనూ దసరాకు వచ్చిన పెద్ద టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ ఇదొక్కటే.
ఇవాళ్టితో విజయదశమి సెలవులు అయిపోతాయి. రేపటి నుంచి స్కూళ్ళు, ఆఫీసులు, కాలేజీలు హడావిడి వేరుగా ఉంటుంది. గురువారం నుంచి డ్రాప్ పర్సెంటెజ్ ఎక్కువ లేకపోతే రికవరీ అవకాశాలు మరింతగా పెరుగుతాయి. ఓవర్సీస్ లో బాగా పట్టున్న విజయ్ దేవరకొండ ఈసారి అక్కడ తన మేజిక్ చూపించలేకపోయాడు. ఒకవేళ అది జరిగి ఉంటే బ్లాక్ బస్టర్ స్టాంప్ పడేది. ఇదొక్కట్టే ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా భావిస్తున్న విషయం. లేకపోతే పండగంతా రణబాలిదే అయ్యేది.
మన దగ్గర జైలర్ 2కి పాజిటివ్ రెస్పాన్స్ రావడం రణబాలి మీద ఎఫెక్ట్ చూపించింది. ఉత్తరాంధ్రలో గరివిడి లక్ష్మి రూపంలో వచ్చిన పోటీ కలెక్షన్లకు ప్రతిబంధకంగా మారింది. నార్త్ అమెరికా జనాలకు ఈ జానర్, వయొలెన్స్ అంతగా నచ్చలేదు. ఈ మూడు అంశాలు కనక లేకపోయి ఉంటే రణబాలికి ఇంకా మంచి ఫలితం దక్కేది. విజయ్ దేవరకొండ గత చిత్రాలతో పోలిస్తే ఇది చాలా మెరుగనే వాస్తవాన్ని ఎవరూ కొట్టి పారేయలేరు. అక్టోబర్ 30 వరకు బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ పెద్ద హీరో సినిమా ఏదీ లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates