సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘జైలర్-2’కు విడుదల ముంగిట పెద్దగా హైప్ ఏమీ కనిపించలేదు. ఆ సినిమా ప్రోమోలు అంతంతమాత్రంగానే అనిపించాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. అందులోనూ ఏపీలో టికెట్ల ధరలు పెంచడం పట్ల చాలా వ్యతిరేకత కూడా కనిపించింది. ఒక టైంలో ‘జైలర్-2’ను బాయ్‌కాట్ చేయాలన్న పిలుపు కూడా వినిపించింది సోషల్ మీడియాలో.
ఇలా అన్నీ ప్రతికూలంగా కనిపించిన సినిమా మీద నిర్మాత నాగవంశీ రూ.45 కోట్లు పెట్టుబడి పెట్టాడనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి ‘జైలర్-2’కు వేరే పెద్ద నిర్మాత ఆఫర్ చేసిన మొత్తం రూ.30 కోట్లే. కానీ నాగవంశీ.. సన్ పిక్చర్స్ అంచనాలకు తగ్గట్లే ఫ్యాన్సీ రేటు ఇచ్చి రైట్స్ తీసుకున్నాడు. కానీ అతను చేసిన రిస్క్ ఇప్పుడు మంచి ఫలితాన్నే ఇస్తోంది.
‘జైలర్-2’ తమిళంతో దీటుగా తెలుగులో వసూళ్లు రాబడుతోంది. తొలి వీకెండ్లోనే ‘జైలర్-2’ 50-60 శాతం మధ్య రికవరీ రాబట్టేసింది. వీకెండ్ తర్వాత కూడా సినిమా జోరు కొనసాగిస్తోంది. బయ్యర్లకు పెద్ద రేట్లకే అమ్మినా సరే.. సినిమా బ్రేక్ ఈవెన్ అయి మంచి లాభాలే అందుకునేలా కనిపిస్తోంది. నాగవంశీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్లోనూ కొన్ని ఏరియాల్లో వేరే సంస్థ భాగస్వామ్యంతో సినిమాను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా మీద భారీ పెట్టుబడే పెట్టాడట. ఐతే బ్రేక్ ఈవెన్ కావడమే కాదు, మంచి కమిషన్ కూడా వచ్చే సంకేతాలూ కనిపిస్తున్నాయి. మొత్తంగా సినిమా మీద నాగవంశీకి మంచి పెద్ద ఎత్తునే లాభాలు రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఐతే నాగవంశీ ‘జైలర్-2’ మీద ఇంత రిస్క్ చేసి భారీ పెట్టుబడి పెట్టడానికి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన హామీనే కారణమని ఒక డిస్కషన్ నడుస్తోంది. బీజీఎం ఇవ్వడం కోసం సినిమా చూసిన అనిరుధ్.. ఈ సినిమా బాగానే మ్యాజిక్ చేస్తుందని నమ్మాడు. అనిరుధ్‌తో నాగవంశీకి మంచి స్నేహం ఉంది. తనతో జెర్సీ, కింగ్డమ్ సినిమాలకు పని చేశాడు. ‘దేవర’ టైంలోనూ కలిసి ట్రావెల్ చేశాడు. ఆ అసోసియేషన్‌తోనే ‘జైలర్-2’ గురించి అతను ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌ను అనుసరించే నాగవంశీ ధైర్యం చేశాడని.. అతను చేసిన రిస్క్ ఇప్పుడు మంచి ఫలితాన్నిస్తోందని ఇండస్ట్రీలో డిస్కషన్ నడుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates