ఆదర్శ కుటుంబం అఫీషియల్ డేట్ కేవలం పది రోజుల ముందు వచ్చింది. వెంకటేష్ ద్వారా ఆన్ లైన్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇది ముందే తెలిసిన విషయమే అయినా మళ్ళీ ఏదైనా మార్పు ఉంటుందేమోనని ఫ్యాన్స్ భావించారు. డిస్ట్రిబ్యూటర్లకు ముందే సమాచారం ఉండటంతో థియేటర్ల వ్యవహారాలకు టెన్షన్ ఉండదు. ఇది వస్తుందో రాదోననే అయోమయంలో నలిగిన విశ్వక్ సేన్ కల్ట్, నాగార్జున ప్రెజెంట్ చేసిన ఇట్లు అర్జున ఎలాంటి మార్పు లేకుండా బరిలో దిగుతున్నాయి. దేనికవే ప్రచారంతో ఆకట్టుకుంటున్నాయి.
అసలు ముప్పు విషయానికి వస్తే ఆదర్శ కుటుంబానికి సంబంధించి ఇప్పటిదాకా వావ్ అనిపించే కంటెంట్ ఏదీ బయటికి రాలేదు. నారాయణమ్మ సాంగ్ జస్ట్ ఓకే అనిపించుకుంటే, నిన్న విడుదల మాలా పాట మీద విమర్శల వర్షం కురుస్తోంది. మ్యూజిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే త్రివిక్రమ్ ఈసారి తమన్ నుంచి ఎందుకు బెస్ట్ రాబట్టుకోలేదని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. టైం, బడ్జెట్ అని సాకులు చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇదేమి ప్యాన్ ఇండియా గ్రాండియర్ కాదు.
బజ్ పరంగా ఆదర్శ కుటుంబం వెనుకబడి ఉంది. సోలో హీరోగా సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ చేసిన సినిమా ఇది. అది కూడా దర్శకుడు త్రివిక్రమ్ మొదటిసారి కాంబోలో. అలాంటప్పుడు అంచనాలు పీక్స్ లో ఉండాలి. హైప్ ఆకాశంలో కనిపించాలి. కానీ అవేవి ప్రస్తుతానికి లేవు. వాయిదాల వల్ల అక్టోబర్ లోనే రెండు డేట్లు వదిలేసిన ఈ ఫామిలీ ఎంటర్ టైనర్ కు క్షేత్ర స్థాయిలో ఎందుకు ప్రతికూలత ఉందో గుర్తించాల్సిన అవసరం త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఉంది.
మొత్తం సినిమా చూసేదాకా ఫలితాన్ని ఎక్స్ పెక్ట్ చేయలేం కానీ ఓపెనింగ్స్ బాగా రావాలంటే పబ్లిసిటీ మెటీరియల్ పోషించే పాత్ర చాలా కీలకం అవుతుంది. త్రివిక్రమ్ ఏమైనా సర్ప్రైజులు ప్లాన్ చేస్తారని అనుకోవడానికి లేదు. అసలే తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ప్యాన్ వరల్డ్ మూవీ ఉంది. ఇప్పుడు ఆదర్శ కుటుంబం ఏ మాత్రం అటుఇటు అయినా డైరెక్టర్ బ్రాండ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో త్రివిక్రమ్ ఒకసారి మొత్తం విశ్లేషణ చేసుకోవడం బెటర్. ముందైతే ప్రచార పర్వం ఎలా ఉండాలనేది కీలక ఘట్టం కానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates