సోషల్ మీడియా జమానాలో పెద్ద సినిమాల లీకులు ఆపడం దర్శక నిర్మాతలకు చాలా కష్టమైపోయింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీటిని కట్టడి చేయడం కావడం లేదు. కొన్నిసార్లు మేకర్స్ కావాలని చేయగా మరికొన్ని సార్లు అనుకోకుండా జరిగిపోతున్నాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్, వారణాసికి కూడా ఈ బెడద తప్పలేదు. ఆ మధ్య వెంకటేష్ జనవరి 12 విడుదల సాంగ్ క్లిప్ ఒకటి బయటికి రావడం చూశాం. అనిల్ రావిపూడి సీరియస్ గా తీసుకోలేదు కాబట్టి అంతగా హైలైట్ కాలేదు.
తాజాగా కాకా క్లిప్ ఒకటి ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. శంకర్ దాదా తరహా బాడీ లాంగ్వేజ్, రౌడీ అల్లుడు తరహాలో మాస్ గెటప్ వేసుకుని చిరంజీవి ఒక పెళ్లి మండపంలోకి వెళ్లే సన్నివేశం ఎవరో దూరం నుంచి షూట్ చేసి ఎక్స్, ఇన్స్ టాలో పెట్టారు. అంతే ఇది కాస్తా వైరల్ అవుతూ ఎక్కడెక్కడికో వెళ్తోంది. ఇందులో చిరు మూడు గెటప్స్ లో కనిపిస్తారని ముందు నుంచే లీక్ ఉంది. ఒకటి టీజర్ లో ఆల్రెడీ చూపించగా, ఇప్పుడు బయటికి వచ్చింది దానికన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంది.
జనవరి 13 రిలీజ్ టార్గెట్ పెట్టుకుని దర్శకుడు బాబీ కొల్లి షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. పది రోజులు మినహాయిస్తే అక్టోబర్ నెల అయిపోతుంది. అక్కడి నుంచి కేవలం 72 రోజులు మాత్రమే టైం ఉంటుంది. డిసెంబర్ మూడో వారం కల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకుంటే ప్రమోషన్లకు తగినంత సమయం దొరుకుతుంది. ఈలోగా తమన్ కంపోజ్ చేసిన పాటల విడుదల వగైరాలు ఉంటాయి. చిరు భార్యగా స్నేహ నటించగా అనస్వర రాజన్ వీళ్ళ కూతురిగా ఒక ముఖ్యమైన పాత్ర దక్కించుకుంది.
వాల్తేరు వీరయ్య కాంబో కావడంతో కాకా మీద మెగా ఫ్యాన్స్ లో బోలెడు అంచనాలున్నాయి. అంతే కాదు పవన్ కళ్యాణ్ ఇప్పట్లో సినిమాలు చేసేలా లేరు. రామ్ చరణ్ 17 ఇంకా ప్రారంభమే కాలేదు. సో మెగా ఫ్యాన్స్ కి నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చే బాధ్యత పూర్తిగా చిరంజీవి భుజాల మీదే ఉంది. ఎలాగూ కాకా తర్వాత తక్కువ గ్యాప్ లోనే విశ్వంభర వచ్చేలా ఉంది. ఈ రెండు ఓకే కానీ మెగాస్టార్ నెక్స్ట్ ఎవరికి ఎస్ చెప్పారనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates