సూపర్ స్టార్ రజనీకాంత్ సత్తా ఏంటో మరోసారి బాక్సాఫీస్ సాక్షిగా బయట పడుతోంది. టాక్ యునానిమస్ లేకపోయినా ఎబోవ్ యావరేజ్ అనిపించుకుంటే చాలు తన కలెక్షన్ల అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి జైలర్ 2 తో రుజువు చేస్తున్నారు. కేవలం రెండు రోజులకే రెండు వందల పదిహేను కోట్లకు పైగా కొల్లగొట్టిన ముత్తువేల్ పాండియన్ వీకెండ్ కాగానే నాలుగు వందల యాభై మార్కు అందుకోవడం ఈజీగా కనిపిస్తోంది. తమిళనాడులో దీని ప్రకంపనలకు థియేటర్లలో రీ సౌండ్లు వినిపిస్తున్నాయి.
అక్కడే కాదు ఏపీ తెలంగాణలోనూ జైలర్ 2 ఆక్యుపెన్సీలు స్ట్రాంగ్ గా ఉన్నాయి. అసలే సెలవు రోజులు. సింపుల్ ఎలివేషన్లు, డార్క్ కామెడీ, రిపీట్ అనిపించినా సరే సీన్లకు బోలెడంత బలంగా నిలిచిన అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అన్నింటిని మించి తలైవర్ స్టయిల్ అండ్ స్వాగ్ మనోళ్లతో కూడా టికెట్లు కొనిపిస్తున్నాయి. టికెట్ రేట్లు యాభై నుంచి డెబ్భై అయిదు రూపాయల దాకా పెంచినా ఆంధ్రప్రదేశ్ లోనూ బలంగా ఉండటం విశేషం. రణబాలి పోటీలోనూ ధీటుగా నిలబడింది.
జైలర్ 2 లో రజనీకాంత్ డాన్సులు చేయరు. హీరోయిన్ ట్రాక్ అసలే లేదు. కొడుకు పోయిన తండ్రిగా, మనవడిని స్కూలుకు తీసుకెళ్లే తాతగా చాలా మాములు పాత్ర పోషించారు. శత్రువులను చంపాల్సి వచ్చినా ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే ఫైట్లతో కాకుండా సింపుల్ ఆయుధాలతో ప్రాణం తీస్తారు. ఒకవేళ తన చేత కాదని ముందే గుర్తిస్తే స్నేహితుల సహాయంతో ఫ్యామిలీ మీద ఈగ వాలకుండా చేసుకుంటారు. ఇదంతా డెబ్భై వయసు దాటిన ఒక ఓల్డ్ మ్యాన్ చేసిన విధ్వంసం.
బహుశా ఇలాంటి క్యారెక్టరైజేషన్ తో కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ రాలేదనే చెప్పాలి. భారతీయుడు లాంటివి ఉన్నాయి కానీ అందులో కమల్ హాసన్ మనీషా కొయిరాలా, ఊర్మిళతో స్టెప్పులు వేస్తారు. అందుకే జైలర్ 2 చాలా స్పెషల్ గా నిలుస్తోంది. ఈ దూకుడు సోమవారం నుంచి ఎంత మోతాదులో ఉంటుందనే దాన్ని బట్టి ఫైనల్ గా కూలిని దాటేసి ఎంత దూరంలో వెళ్తుందనేది క్లారిటీ వస్తుంది. కొందరు 2.0ని దాటేస్తుందని అంచనా వేస్తున్నారు కానీ ఇదే దూకుడు కనీసం వారం పది రోజుల దాకా ఉంటేనే అది సాధ్యమవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates