అనిరుధ్ రవిచందర్ పేరుకు తమిళ సంగీత దర్శకుడే కానీ.. ప్రస్తుతం ఇండియాలో అతనే నంబర్ వన్ అనడంలో ఎవరికీ సందేహాలు లేవు. తాజాగా జైలర్-2 మూవీతో తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు అనిరుధ్. ఈ చిత్రాన్ని నిర్మంచిన సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్.. అనిరుధ్‌ను అల్లుడిగా చేసుకోబోతున్న విషయం కొన్ని నెలల ముందే వెల్లడైంది.
కొన్నేళ్లుగా కళానిధి తనయురాలు, ఐపీఎల్ టీం సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్‌తో అనిరుధ్ ప్రేమలో ఉండగా.. వీరి పెళ్లి గురించి ఇప్పుడు అధికారిక సమాచారం బయటికి వచ్చేసింది. నవంబరు 21న చెన్నైలో జరిగే అనిరుధ్, కావ్యల వెడ్డింగ్ రిసెప్షన్ కోసం అతిథులను పిలవడం మొదలుపెట్టారు కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరి మారన్.
ఇందులో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన కళానిధి, కావేరి.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి తమ కూతురి వివాహ విందుకు ఆహ్వానం పలికారు. నవంబరు 10న అనిరుధ్, కావ్య డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. అందుకు గ్రీస్ వేదికగా ఖరారైనట్లు సమాచారం. రెండు కుటుంబాలకు చెందిన ముఖ్యమైన సభ్యులు, సన్నిహితుల నడుమ అనిరుధ్, కావ్యల పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ సతీమణి లత సోదరుడైన ఒకప్పటి నటుడు రవిచందర్ తనయుడే అనిరుధ్. టీనేజీలోనే సంగీతంలో అతను సంచలనాలు రేపాడు. 18 ఏళ్ల వయసులో 3 సినిమాకు సంగీతం అందిస్తూ అతను కంపోజ్ చేసిన కొలవరి పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది.
అనతి కాలంలోనే అతను తమిళంలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు. ఆపై తెలుగు, హిందీలోనూ భారీ చిత్రాలకు పని చేసి ఇప్పుడు ఇండియా మొత్తంలో నంబర్‌వన్ స్థాయికి ఎదిగాడు. కావ్య సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును విజయవంతంగా నడిపిస్తూ, ఆ జట్టు మ్యాచ్‌ల్లో తళుక్కుమంటూ మంచి పాపులారిటీ సంపాదించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates