తాజాగా విడుదలైన జైలర్ 2లో అసలు హీరోయినే లేకపోవడం మనం మొదటి భాగంలోనూ చూశాం. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కమర్షియల్ మార్కెట్ కోసం బలవంతంగా ఇరికించడం లాంటివి చేయలేదు. ముత్తువేల్ పాండియన్ కు ఫ్లాష్ బ్యాక్ ఉన్నప్పటికీ అక్కడా అవసరం లేని చొరవ తీసుకోకుండా కేవలం కథను చెప్పడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు జైలర్ 2 కి కూడా అదే ఫార్ములా వాడారు. అయితే పార్ట్ 1 అంత యునానిమస్ టాక్ లేకపోయినా వసూళ్లు మాత్రం బాగా వస్తున్నాయి.
ఇదిలా ఉండగా జైలర్ 2లో లేడీ విలన్ క్యారెక్టర్ అధిక శాతం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఆ పాత్ర చేసింది విద్య బాలన్. ఎస్జె సూర్య చెల్లిగా అస్తమానం సిగరెట్ తాగుతూ, ఏకంగా రజని మొహం మీద పొగ ఊదే సన్నివేశంలో బాగా పొగరు చూపించింది. విద్య బాలన్ మనకు కొత్త కాదు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాల్లో బాలకృష్ణ జంటగా నటించింది. అంతకు ముందు ఆ తర్వాత టాలీవుడ్ లో చేయలేదు. ది డర్టీ పిక్చర్ తెలుగు డబ్బింగ్ అయితే మంచి గుర్తింపు తెచ్చింది.
మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత విద్య బాలన్ కు ఉనికిని చాటుకునే ఛాన్స్ వచ్చింది. కేవలం సెకండాఫ్ కే పరిమితమైనా గుర్తుండిపోయే సీన్లయితే తనకు పడిన మాట వాస్తవం. జైలర్ 3కి క్లూ కూడా ఆమె ద్వారానే ఇవ్వడం మరో ట్విస్టు. అంటే ఒకవేళ నెల్సన్ కనక ఇంకో పార్ట్ తీస్తే అప్పుడు మెయిన్ స్టోరీ మొత్తం విద్య బాలన్ చుట్టే తిరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రకటన ఇంకా రాలేదు. కమర్షియల్ గా పెద్ద స్థాయిలో రిజల్ట్ వస్తే కనక అప్పుడు డిసైడ్ చేస్తారు కాబోలు.
మన టాలీవుడ్ దర్శకులు కూడా లేడీ విలన్స్ మీద ఫోకస్ పెట్టాలి. రమ్యకృష్ణ లాంటి సీనియర్ ఆర్టిస్టులు నెగటివ్ షేడ్స్ అద్భుతంగా పండిస్తారని నరసింహ లాంటివి ఎప్పుడో నిరూపించాయి. ఇప్పుడు విద్య బాలన్ లాగా యాభై వయసుకు దగ్గరలో ఉన్న సీనియర్ హీరోయిన్లు చాలానే ఉన్నారు. వాళ్లకు తగ్గట్టు క్యారెక్టర్లు రాస్తే జనం బాగా రిసీవ్ చేసుకుంటారు. వేగంగా కాకపోయినా థియేటర్, ఓటిటి కలిపి ఏడాదికి రెండు మూడు రిలీజులు ఉండేలా విద్య బాలన్ ప్లాన్ చేసుకుంటోంది.
This post was last modified on October 16, 2026 5:42 pm
అనిరుధ్ రవిచందర్ పేరుకు తమిళ సంగీత దర్శకుడే కానీ.. ప్రస్తుతం ఇండియాలో అతనే నంబర్ వన్ అనడంలో ఎవరికీ సందేహాలు…
ఆ యువతీ యువకులు.. గాఢంగా ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుని స్థిరపడదామని అనుకున్నారు. కానీ, విధి వక్రించింది. ఓ వ్యక్తిని…
కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి రిలీజ్ డేట్ల వ్యవహారం గురించి పంచులు వేశారు. నేరుగా సినిమా పేర్లు ప్రస్తావించకపోయినా, అన్నది…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు శుక్రవారం తెరదీశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. తొలిరోజే ఉమ్మడి కడప, ఉమ్మడి…
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ డెత్ మిస్టరీ కేసులో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు…
నిన్న రిలీజైన జైలర్ 2 టాక్, కలెక్షన్లు కాసేపు పక్కనపెడితే ఫ్యాన్స్ నుంచి వచ్చిన కంప్లయింట్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో…