ఆదర్శ కుటుంబం తప్పుకుంది. అక్టోబర్ 2 విడుదలైన వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. సో దసరా పండక్కు వచ్చే సెలవులను క్యాష్ చేసుకోవడానికి టాలీవుడ్ బాక్సాఫీస్ ఎదురు చూస్తోంది. ముందు కామ్రేడ్ కళ్యాణ్, హనుమాన్ అంశ్ వచ్చేస్తాయి. ఆ తర్వాత వారం తిరగడం ఆలస్యం కొత్తవి క్యూ కడతాయి. ముఖ్యంగా ఈసారి అయిదు సినిమాల విజయదశమి పోటీలో రెండు భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీస్ ఉండగా మరో మూడు రీజనబుల్ బడ్జెట్ లో రూపొందిన చిన్న చిత్రాలు.
మొదటగా వస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ మీద భీభత్సమైన హైప్ లేదు కానీ రజని స్టామినాని తక్కువంచనా వేయడానికి లేదు. ట్రైలర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా టీమ్ మాత్రం ఫలితం పట్ల ధీమాగా ఉంది. తెలుగు హక్కులు నలభై అయిదు కోట్ల దాకా అమ్ముడుపోవడం పెద్ద రికార్డే. కాకపోతే విడుదలకు ముందే ఏర్పడిన ప్రీ నెగటివిటీని తట్టుకుని ముత్తువేల్ పాండియన్ తన విశ్వరూపం చూపించాల్సి ఉంటుంది. పనిలో పని కూలి చేసిన గాయం కూడా మానిపోవాలి.
ఒక రోజు గ్యాప్ తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’ రంగంలోకి దిగుతాడు. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ తో రాహుల్ సంకృత్యాన్ తీసిన ఈ హిస్టారికల్ డ్రామాకు అతుల్ అజయ్ సంగీతం సమకూర్చగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా నిర్మించారు. అక్టోబర్ 16 రెండు సినిమాలు ఢీ కొంటున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘గరివిడి లక్ష్మి’ మెల్లగా సౌండ్ చేయడం మొదలుపెట్టింది. జాప్యం వల్ల ఇప్పటికైతే బజ్ లేదు కానీ క్రమంగా దాన్ని పెంచాలి.
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించిన ‘క్రేజీ కళ్యాణం’ అదే రోజు రానుంది. ఇది కూడా పబ్లిసిటీ పరంగా స్పీడ్ పెంచుకోవాల్సి ఉంటుంది. ఒక రోజు ఆగి చిన్న పిల్లలను ప్రధాన పాత్రల్లో పెట్టి తీసిన ‘సమ్మర్ హాలిడేస్’ మీద హైప్ పెంచేందుకు నిర్మాత ధీరజ్ మొగిలినేని టీమ్ గ్రౌండ్ రెడీ చేస్తోంది. ఈ పంచతంత్ర పోటీలో విజేతలు ఎవరవుతారనేది ఆసక్తికరంగా మారింది. జైలర్ 2, రణబాలి రేంజ్ చాలా పెద్దది అయినప్పటికీ వాటితో ఏకంగా మూడు చిన్న సినిమాలు తలపడటం అసలు ట్విస్టు.
Gulte Telugu Telugu Political and Movie News Updates