కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని అయిన శ్రీవిష్ణు తన కామ్రేడ్ కళ్యాణ్ తో ఆదర్శ కుటుంబం ఏకె 47 క్లాష్ కి సిద్ధ పడిన సంగతి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వెనుకడుగు వేసే పరిస్థితి లేకపోవడంతో టీమ్ దానికి అనుగుణంగా ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చింది. అనూహ్యంగా వెంకటేష్ మూవీ వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కి ఆషామాషీగా కలిసి రావడం లేదు.
ఆదర్శ కుటుంబం కోసం ప్లాన్ చేసుకున్న సింగల్ స్క్రీన్లు, మల్టీప్లెక్సుల్లో అధిక శాతం కామ్రేడ్ కళ్యాణ్ కి ఇచ్చే అవకాశాలున్నాయి. ఎలాగూ గాంధీ జయంతికి వచ్చిన సినిమాలేవి స్ట్రాంగ్ గా నిలబడలేదు. సరైన టాక్ తెచ్చుకోలేక మొదటి వీకెండ్ కావడం ఆలస్యం విపరీతంగా ఎదురీదుతున్నాయి. పైగా ప్యారడైజ్ మూడో వారం ఏదైనా అద్భుతం అనిపించే పికప్ అసాధ్యం కాబట్టి ఉన్నంతలో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఛాయస్ కామ్రేడ్ కళ్యాణ్ అవుతుందని చెప్పడంలో డౌట్ లేదు.
జైలర్ 2, రణబాలి ఎలాగూ తర్వాతి వారం వస్తాయి కాబట్టి ఆలోగా కామ్రేడ్ కళ్యాణ్ ఓపెన్ గ్రౌండ్ ని దున్నేయొచ్చు,. కాకపోతే టాక్ ఖచ్చితంగా పాజిటివ్ లేదా ఎబోవ్ యావరేజ్ ఉండాలి. ఏ మాత్రం అటుఇటు ఉన్నా జనాలు నిర్మొహమాటంగా రెడ్ కార్డు చూపిస్తారు. అది టాక్సిక్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ అయినా ఎపిక్ లాంటి తక్కువ బడ్జెట్ లో తీసిన లవ్ స్టోరీ అయినా ట్రీట్ మెంట్ ఒకటే. బాలేకపోతే దారుణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసి మరీ ఆడుకున్నారు.
సో కామ్రేడ్ కళ్యాణ్ కనక యునానిమస్ అనిపించుకుంటే కలెక్షన్లు బాగుంటాయి. కాన్సెప్ట్ చూస్తే వెరైటీగానే ఉంది. ఎప్పుడూ సీరియస్ గా ఉండే నక్సలైట్ బ్యాక్ డ్రాప్ కి వినోదాన్ని జోడించడమనే ఐడియా బాగుంది. వర్కౌట్ అయితే మటుకు శ్రీవిష్ణు ఖాతాలో హిట్టు పడ్డట్టే. అసలే ఈ ఏడాది మృత్యుంజయ్, విష్ణు విన్యాసం రూపంలో రెండు ఫ్లాపులు వచ్చాయి. వాటిని మరిపించేలా కామ్రేడ్ కళ్యాణ్ కనక విజయం సాధిస్తే అభిమానులకు పండగ గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates