డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి ఫ్లాప్ దిశగా పరుగులు పెడుతోంది. తెల్లకాగితం లాంటి చిన్న సినిమా పోటీ ఇచ్చిందంటే ఇది సీరియస్ గా పట్టించుకోవాల్సిన విషయం. రాజమౌళి ఫ్యామిలీ ఈ మూవీ ప్రమోషన్ కోసం చాలా చేసింది. నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ దీన్ని ప్రెస్టీజియస్ గా తీసుకోవడంతో రాజమౌళినే రంగంలోకి దిగారు. ఎంత చేయాలో అంతా చేశారు. లడ్డు వేలం లాంటి ప్రోగ్రాంలో సైతం నటించారు.
దీనికి వారణాసికి లింక్ విషయానికి వద్దాం. రాజమౌళి ఇంత నమ్మకంగా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ని ప్రమోట్ చేసిన విధానం బయ్యర్లను ఆకర్షించింది. మన దగ్గరే కాదు కేరళ, ఓవర్సీస్ లో దీని బిజినెస్ రేంజ్ కి జక్కన్న ఫోటో చాలా ప్లస్ అయ్యింది. ఆయన విని ఓకే చేశారంటే ఖచ్చితంగా నమ్మదగిన ప్రాజెక్టని బయ్యర్లు, ఆడియన్స్ ఫిక్సయ్యారు. అందుకే బిజినెస్ బాగా జరిగింది. వారాణసి మొదలయ్యాక రాజమౌళి బయట ఎక్కువ సేపు మీడియా కెమెరాలో కనిపించింది ట్రబుల్ కోసమే.
ఇది డబ్బుల గురించి డిస్కషన్ కాదు. ఎందుకంటే డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ఆడినా ఆడకపోయినా ఆర్కా సంస్థ, కార్తికేయకు పోయేదేమీ లేదు. కానీ రాజమౌళి బ్రాండ్ ని వాడుకున్న విధానం వారణాసి క్రెడిబిలిటీ మీద ఎంతో కొంత ప్రభావమైతే చూపిస్తుంది. ఇంత చిన్న సినిమాకు తమ పిఆర్ సోర్సులన్నీ వాడేశారు. అయినా రిజల్ట్ రాలేదు. జక్కన్న ఫ్యామిలీని చూసి మొదటి రోజే వచ్చిన జనాలను దర్శకుడు శశాంక్ యేలేటి నిరాశపరిచిన విధానం ఎంతో కొంత డ్యామేజ్ అయితే చేసింది.
ఇదే తరహాలో పోయిన నెల రోమాంచకం కోసం సందీప్ రెడ్డి వంగ, ప్రణయ్ వంగ విపరీతంగా పబ్లిసిటీ చేశారు. బోలెడు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయినా లాభం లేకపోయింది. డిజిటల్ డీల్స్ వల్ల పెట్టుబడి సేఫయ్యింది కానీ థియేట్రికల్, పబ్లిక్ రెస్పాన్స్ పరంగా అది ఫ్లాప్ కిందకే వస్తుంది. ఇప్పుడు రాజమౌళి విషయంలోనూ అదే రిపీట్ అయ్యింది. వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ గ్రాండియర్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు రాజమౌళి ఇతర సినిమాల గురించి తన స్థాయిలో ఆలోచించాలేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates