అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47 ఉన్నా సరే ఏం పర్లేదంటూ బరిలో దిగుతోంది. వాయిదా సూచనలు ఉన్నాయంటూ ఏదో ప్రచారం జరిగింది కానీ నిర్మాతలు అలాంటి ప్రకటన ఇచ్చే దిశగా వెళ్తున్నట్టు లేదు. శ్రీవిష్ణు ఫేవరెట్ హీరో వెంకటేష్. అలాంటిది ఆయనతో క్లాష్ కి రెడీ కావడం అంటే గుండె ధైర్యం గట్టిదే అని చెప్పాలి. అయితే దీని వెనుక పలు కారణాలున్నాయని తెలుస్తోంది.
మొదటిది కామ్రేడ్ కళ్యాణ్ లో ఎంటర్ టైన్మెంట్ సాలిడ్ గా వచ్చిందట. వచ్చిన ప్రేక్షకులను నవ్వించడం గ్యారెంటీ అని రషెస్ చూసినవాళ్లు చెబుతున్న మాట. ముఖ్యంగా సత్య మరోసారి పేలిపోయే క్యారెక్టర్ దక్కించుకున్నాడని, కొరియన్ కనకరాజు తరహాలో ఇందులో కూడా మేజిక్ చేశాడని అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అడవిలో నక్సలైట్ల మధ్య జరిగే ఫన్నీ ఎపిసోడ్స్ మెయిన్ హైలైట్ గా ఉంటాయి. మనోభావాలు దెబ్బ తినకుండా వాటిని డిజైన్ చేశారట.
ఇంకో విషయం ఏంటంటే కామ్రేడ్ కళ్యాణ్ కి ఆల్రెడీ ఓటిటి డీల్ అయ్యిందని టాక్. సో డేట్ మార్చడానికి ఉండదు. ఎలాగూ దసరాకు జైలర్ 2, రణబాలి వస్తున్నాయి. రెండింటితో తలపడటం కన్నా ఒక ఆదర్శ కుటుంబంతో ఫైట్ చేయడమే సేఫ్ అనుకున్నారేమో. ఎలా చూసుకున్నా కేవలం వన్ వీక్ గ్యాప్ లో ఇన్ని ఫేస్ చేయడం కామ్రేడ్ కళ్యాణ్ కు ఒక రకంగా సవాల్ లాంటిదే. కాకపోతే పండగ సెలవులు ఉన్నాయి కాబట్టి ఈజీగా రెండు మూడు సినిమాలకు స్పేస్ దొరుకుతుంది.
ఈ ఏడాది మృత్యుంజయ్, విష్ణు విన్యాసం రూపంలో రెండు ఫెయిల్యూర్స్ చూసిన శ్రీవిష్ణుకి ఈ కామ్రేడ్ కళ్యాణ్ హిట్ కావడం చాలా కీలకం. కామెడీ కనెక్ట్ అయ్యిందా దాని బడ్జెట్ ఈజీగా రికవరీ అయిపోతుంది. నెక్స్ట్ సంక్రాంతికి ప్లాన్ చేసుకున్న ఫ్యామిలీ ప్యాక్ కూడా నవ్వులు పంచడమే లక్ష్యంగా రూపొందుతోందట. ఇకపై సీరియస్ జానర్లకు దూరంగా ఉంటూ వినోదానికే ప్రాధాన్యం ఇచ్చేలా శ్రీవిష్ణు కథలు వింటున్నాడని తెలిసింది. అల్లరి నరేష్ వెనుక బడిన టైంలో ఇది మంచి స్ట్రాటజీనే.
Gulte Telugu Telugu Political and Movie News Updates
