మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు సందర్భాల్లో బయట పడుతూ ఉంటుంది. సలార్ ప్రమోషన్స్ టైంలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ చిన్నప్పుడు కర్ణాటకలో తాను పుట్టి పెరిగిన చోట చిరంజీవి సినిమాలు ఎన్నో చూశానని, వాటి ప్రభావం తన మీద బలంగా ఉందని చెప్పడం వీడియో ఇంటర్వ్యూలో ఉంది. రోమాంచకం టైంలో నిర్మాతగా మారిన సందీప్ వంగ కూడా ఇదే తరహాలో ఓపెన్ అయ్యారు.
ఖైదీ నెంబర్ 786, మాస్టర్ లాంటి పాత సినిమాల రిఫరెన్స్ తో మొదలుపెట్టి టీనేజ్ లో ఉన్నప్పుడు ఆయన్న తప్ప వేరే హీరోలు ఉంటారని తెలియదని ఒప్పుకునే దాకా సందీప్ పంచుకున్న విశేషాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. తాజాగా శ్రీకాంత్ ఓదెల ఈ లిస్టులో చేరారు. ప్యారడైజ్ ప్రమోషన్లలో భాగంగా విలన్ రాఘవ్ జుయెల్ తో కలిసి పాల్గొన్న కార్ ట్రిప్ లో మాట్లాడుతూ తనకు చిరంజీవి ఎంత అభిమానమో ఛాన్స్ దొరికినప్పుడంతా పంచుకున్నారు.
ఏదైనా ఎప్పుడైనా పార్టీ జరిగితే తమ ఫ్రెండ్స్ అంతా మెగాస్టార్ పాటలు పెట్టుకుని డాన్స్ చేసేవాళ్లమని, రంగస్థలం షూటింగ్ లో చిరంజీవి ప్రత్యేకంగా చేయించిన రుద్రాక్ష లాకెట్ ఒకటి రామ్ చరణ్ తనకు కానుకగా ఇచ్చాడని, ఎందుకో అడగలేక పోయినా ఇప్పటివరకు దాన్ని తీసే ఆలోచన చేయలేదని మురిపెంగా చెప్పుకొచ్చారు. రాఘవ్ ఇదంతా ఆశ్చర్యం వింటూ ఔనా అంటూ కబుర్లలో పడిపోయాడు. మొత్తానికి శ్రీకాంత్ ఓదెలకు ఎంత ఫ్యానిజం ఉందో ఇంకోసారి అర్థమయ్యింది.
ఇదంతా బాగానే ఉంది కానీ ప్యారడైజ్ రిలీజ్ తర్వాత మెగాస్టార్ తో శ్రీకాంత్ ఓదెల చేయాల్సిన మూవీ సంగతులు అట్టే రివీల్ కావడం లేదు. ఫలితం తేలాక అనౌన్స్ మెంట్ ఇస్తారా లేక నిర్మాతగా ఉన్న నాని మనసు ఏమైనా మారిందా అనేది సస్పెన్స్ గానే ఉంది. సెప్టెంబర్ 24 విడుదల కాబోతున్న ప్యారడైజ్ మీద ఓదెల, నానినే కాదు ఇండస్ట్రీ మొత్తం భారీ ఆశలు పెట్టుకుంది. పెద్ది తర్వాత అంత భారీగా రెవిన్యూస్ తీసుకొచ్చే సినిమాగా ఎగ్జిబిటర్లకు కొత్త ఊపిరి ఇస్తుందని ఎదురు చూస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates