యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం.. అందులో తనదే లీడ్ కావడం అసలు ఊహించలేని విషయం. వైష్ణవి చైతన్య కెరీర్లో ఈ అద్భుతమే జరిగింది. ‘సూర్య’ సహా కొన్ని వెబ్ సిరీస్‌లు.. ‘అల వైకుంఠపురములో’ సహా కొన్ని చిత్రాలు చేసిన ఆమెకు ‘బేబి’ లాంటి సెన్సేషనల్ మూవీలో నటించే అవకాశమొచ్చింది.
అందులో లీడ్ రోల్‌ను గొప్పగా పండించి ఆ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది వైష్ణవి. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిన్న సినిమా.. ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టి సంచలనం రేపింది. ఇంత పెద్ద హిట్టు కొట్టినందుకు ఏ హీరోయిన్ అయినా ఎంతో సంతోషిస్తుంది.
కానీ వైష్ణవి మాత్రం ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేని పరిస్థితులు ఎదుర్కొంది.
ఈ చిత్రంలో ప్రేమించిన అబ్బాయిని మోసం చేసే పాత్రలో ఆమెను చూసి.. నిజంగానే తనను హేట్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. అంతే కాక వైష్ణవి స్థాయికి మించి సక్సెస్ వచ్చేసిందంటూ తక్కువ చేసి మాట్లాడడం.. తనకు యాటిట్యూడ్ అని కామెంట్లు చేయడం. ఫేక్ తెలంగాణ యాక్సెంట్ మాట్లాడుతోందని ట్రోల్ చేయడం.. ఇలా చాలానే చేశారు సోషల్ మీడియా జనాలు. ఇంకోవైపేమో తనకు లైఫ్ ఇచ్చిన ‘బేబి’ మేకర్స్ పట్ల కృతజ్ఞతగా లేదని, వారి తర్వాతి సినిమా నుంచి తప్పుకుందని.. ఆ రకంగానూ కొందరు ఆమెను టార్గెట్ చేశారు.
ఈ విషయాలన్నీ వైష్ణవిని బాగానే ప్రభావితం చేశాయట. ‘బేబి’ లాంటి పెద్ద సక్సెస్ వచ్చిందని సంతోషించాలో.. ఈ నెగెటివిటీని తలుచుకుని బాధ పడాలో తెలియని పరిస్థితిని తాను ఎదుర్కొన్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వైష్ణవి వెల్లడించింది. ఒక టైంలో తాను దీని వల్ల వేరే జోన్లోకి వెళ్లిపోయాని.. డిప్రెస్ అయిపోయానని ఆమె చెప్పింది. ఐతే ఇలా ఉండడం కరెక్ట్ కాదని తర్వాత తనకు తాను సర్దిచెప్పకున్నట్లు ఆమె తెలిపింది.
‘బేబి’లో పాత్రను అనుసరించి తనను ద్వేషిస్తున్నారంటే.. అంతగా ఆ పాత్ర జనాల్లోకి వెళ్లిందని, తాను అంత బాగా పెర్ఫామ్ చేశానని అర్థం కదా అనుకుని జనాల నెగెటివిటీని పాజిటివ్‌గా తీసుకునే ప్రయత్నం చేసినట్లు ఆమె వెల్లడించింది. ఓ తెలుగమ్మాయి తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం, ఒక స్థాయి అందుకోవడం చిన్న విషయం కాదు. వైష్ణవి అలాంటి సక్సెస్ సాధిస్తే.. ఇలాంటి నెగెటివిటీతో ఇబ్బంది పడడం విచారకరం. ఆమె బాధను అర్థం చేసుకుని ఇప్పటికైనా తనపై సోషల్ మీడియా హేట్ క్యాంపైన్స్ ఆపేస్తే బెటర్.
Gulte Telugu Telugu Political and Movie News Updates